Anchor Ravi : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం అందరికీ పాజిటివిటీని అందించగా, రవికి మాత్రం కాస్త మైనస్ అయిందనే చెప్పాలి. అతనిపై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేయడం, నాగార్జున పదే పదే సెటైర్స్ వేయడం, అనూహ్యంగా మధ్యలోనే బయటకు రావడం రవితో పాటు ఆయన అభిమానులని ఎంతగానో కలవరపరిచింది. అయితే తనపై ట్రోలింగ్ చేసేవారిపై యుద్ధాన్ని ప్రకటించాడు యాంకర్ రవి.
బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను.. తన కుటుంబ సభ్యులను ట్రోలింగ్ చేయడం.. నెగెటివిటీ స్ప్రెడ్ చేసిన వారి పట్ల సీరియస్ అయ్యాడు రవి. తనపై..తన కుటుంబంపై ట్రోలింగ్ చేసిన వారిని అస్సలు వదలిపెట్టను అంటూ హెచ్చరించాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సేకరించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. తమ పరువుకు నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చిన వారందరి మీద ఫిర్యాదు చేశాను అని పేర్కొన్నాడు.
అయితే తాజాగా రవి భార్య నిత్య తమపై జరిగిన ట్రోలింగ్‌పై స్పందిస్తూ నేను, నా కూతురు ఏం తప్పు చేశాం. దారుణంగా మాటలు మాట్లాడారు. రవి అకౌంట్ ఓపెన్ చేస్తే భయం వేసింది. అంత దారుణంగా దుర్భాషలాడారు. నా అకౌంట్ లో తప్పుడు కామెంట్స్ చేస్తున్నారని బ్లాక్ చేయగా, పాప అకౌంట్‌లో బూతులు పెట్టేవారు. ఇంత దిగజారిపోయారా మనుషులు.. అనిపించేదని రవి భార్య నిత్య స్పష్టం చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…