Anchor Ravi : యాంకర్‌ రవి భార్య నిత్య ఆవేదన.. తాము ఏం పాపం చేశామని కామెంట్స్‌..

December 19, 2021 11:22 AM

Anchor Ravi : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్రమం అంద‌రికీ పాజిటివిటీని అందించ‌గా, ర‌వికి మాత్రం కాస్త మైన‌స్ అయింద‌నే చెప్పాలి. అత‌నిపై నెటిజ‌న్స్ దారుణంగా ట్రోల్ చేయ‌డం, నాగార్జున ప‌దే ప‌దే సెటైర్స్ వేయ‌డం, అనూహ్యంగా మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు రావ‌డం ర‌వితో పాటు ఆయ‌న అభిమానుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌ర‌ప‌రిచింది. అయితే తనపై ట్రోలింగ్ చేసేవారిపై యుద్ధాన్ని ప్రకటించాడు యాంకర్ రవి.

Anchor Ravi wife nithya emotional about trolling on them

బిగ్‏బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను.. తన కుటుంబ సభ్యులను ట్రోలింగ్ చేయడం.. నెగెటివిటీ స్ప్రెడ్ చేసిన వారి పట్ల సీరియస్ అయ్యాడు రవి. తనపై..తన కుటుంబంపై ట్రోలింగ్ చేసిన వారిని అస్సలు వదలిపెట్టను అంటూ హెచ్చరించాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సేకరించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. తమ పరువుకు నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చిన వారందరి మీద ఫిర్యాదు చేశాను అని పేర్కొన్నాడు.

అయితే తాజాగా ర‌వి భార్య నిత్య త‌మ‌పై జ‌రిగిన ట్రోలింగ్‌పై స్పందిస్తూ నేను, నా కూతురు ఏం త‌ప్పు చేశాం. దారుణంగా మాట‌లు మాట్లాడారు. ర‌వి అకౌంట్ ఓపెన్ చేస్తే భ‌యం వేసింది. అంత దారుణంగా దుర్భాష‌లాడారు. నా అకౌంట్ లో త‌ప్పుడు కామెంట్స్ చేస్తున్నార‌ని బ్లాక్ చేయ‌గా, పాప అకౌంట్‌లో బూతులు పెట్టేవారు. ఇంత దిగ‌జారిపోయారా మ‌నుషులు.. అనిపించేద‌ని ర‌వి భార్య నిత్య స్ప‌ష్టం చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now