Anchor Ravi : బుల్లితెరపై యాంకర్ రవి చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే రవికి భారీ ఎత్తున ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక ఇటీవల అతను బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఓట్లు పడినప్పటికీ రవి ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఆందోళన చేపట్టారు. తరువాత ఆ విషయం సద్దుమణిగింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి తనకు చెందిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తనకు ఎంతో నమ్మకంగా ఉన్న ఓ స్నేహితుడు తనను దారుణంగా మోసం చేశాడని రవి తెలిపాడు. దీంతో ఈ విషయం చెబుతూ రవి భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వ్యక్తిని నమ్మి తాను రూ.45 లక్షలు అప్పుగా ఇచ్చానని, అయితే 20 రోజుల్లోనే అప్పు తీర్చేస్తానని అతను చెప్పాడని తెలిపాడు.
అప్పు ఇచ్చిన సమయంలో ఎలాంటి పత్రాలను కూడా రాసుకోలేదని రవి తెలిపాడు. దీంతో తాను మోసపోయానని అన్నాడు. ఆ వ్యక్తి బిజినెస్ పెట్టుకోవాలన్న.. డబ్బులు కావాలని అడిగితే.. వెంటనే రూ.45 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. ఇప్పటికీ రెండు ఏళ్లు దాటిపోయిందని, అయినప్పటికీ కనీసం అతని ఆచూకీ కూడా లేదని రవి తెలియజేశాడు. ఈ క్రమంలో తాను చట్ట ప్రకారం ముందుకు సాగుతున్నానని అన్నాడు. అతడిని నమ్మి అన్ని డబ్బులను ఇస్తే అతను మాత్రం మోసం చేశాడని అన్నాడు.
రెండేళ్ల పాటు అతను తనతో స్నేహం చేశాడని, అత్యంత నమ్మకస్తుడిగా మెలిగాడని రవి తెలిపాడు. అందువల్లే ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బులు ఇచ్చానన్నాడు. ఈ క్రమంలోనే ఆ డబ్బు తిరిగి రావాలని తన భార్య పూజలు చేసిందని, ఉపవాసాలు ఉందని చెప్పాడు. అయితే ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఉన్నానని, అయినప్పటికీ కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నానని అన్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…