Alia Bhatt : ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా విడుదలైంది. ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అలియా భట్, రాజమౌళి, అజయ్ దేవగణ్, ఎన్టీఆర్, దానయ్య కలిసి పాల్గొన్నారు.
లాంచింగ్ కార్యక్రమంలో అనుకోని సంఘటన జరిగింది. అలియా భట్ కాలు మీద కాలు వేసుకుని కూర్చునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో పక్కనే ఉన్న రాజమౌళికి అలియా భట్ కాళ్లు తగిలాయి. వెంటనే ఆమె క్షమించమన్నట్టు ఆయన కాళ్లు పట్టుకోబోయింది. రాజమౌళి మాత్రం వద్దని అలా ఆపేశాడు. మొత్తానికి ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ మోస్ట్ వాంటెడ్ నంబర్ వన్ హీరోయిన్ అయిన అలియా భట్ సంస్కారం మంచిదంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు రామ్ చరణ్ హాజరు కాలేకపోయాడు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోదరి అనుష్పల పెళ్లి సందర్భంగా రామ్ చరణ్ ఇక్కడే ఆగిపోయాడు. దోమకొండలో ఘనంగా జరిగిన అనుష్పల పెళ్లిలో రామ్ చరణ్ రాయల్ లుక్ అదిరిపోయింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…