Alia Bhatt : రాజ‌మౌళి కాళ్లు ప‌ట్టుకోబోయిన అలియా భ‌ట్..!

December 10, 2021 10:20 AM

Alia Bhatt : ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్రధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ ఆర్ఆర్ఆర్. జ‌న‌వరి 7న విడుద‌ల కానున్న ఈ సినిమా ట్రైల‌ర్ రీసెంట్‌గా విడుద‌లైంది. ఇందులోని ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. కొన్ని స‌న్నివేశాలు రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేశాయి. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అలియా భట్, రాజమౌళి, అజయ్ దేవగణ్, ఎన్టీఆర్, దానయ్య కలిసి పాల్గొన్నారు.

Alia Bhatt touched rajamouli feet

లాంచింగ్ కార్య‌క్ర‌మంలో అనుకోని సంఘ‌ట‌న జ‌రిగింది. అలియా భట్ కాలు మీద కాలు వేసుకుని కూర్చునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ప‌క్క‌నే ఉన్న రాజమౌళికి అలియా భట్ కాళ్లు తగిలాయి. వెంట‌నే ఆమె క్ష‌మించ‌మ‌న్న‌ట్టు ఆయ‌న కాళ్లు ప‌ట్టుకోబోయింది. రాజమౌళి మాత్రం వద్దని అలా ఆపేశాడు. మొత్తానికి ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ మోస్ట్ వాంటెడ్ నంబర్ వన్ హీరోయిన్ అయిన అలియా భట్ సంస్కారం మంచిదంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు రామ్ చ‌ర‌ణ్ హాజ‌రు కాలేక‌పోయాడు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోదరి అనుష్పల పెళ్లి సందర్భంగా రామ్ చరణ్ ఇక్కడే ఆగిపోయాడు. దోమకొండలో ఘనంగా జరిగిన అనుష్పల పెళ్లిలో రామ్ చరణ్ రాయల్ లుక్ అదిరిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now