Ala Ninnu Cheri OTT Streaming : పల్లెటూరి నేపథ్యం ఉన్న కథలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.ఈ కోవలోనే రీసెంట్‌గా వచ్చిన చిత్రం అలా నిన్ను చేరి. కొత్త దర్శకుడు మారేష్ శివన్ తెరకెక్కించిన చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించారు .ఈ సినిమా నవంబర్ 10న థియేటర్లలలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలోకి అలా వచ్చి వెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా సైలెంట్‌గా ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చారు.
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ సినిమాను నిర్మించగా.. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. ఈసినిమాలో కేదార్ శంకర్, అనశ్వి రెడ్డి, శివ కుమార్, చమక్మక్ చంద్ర, ఝాన్సీ, మహేశ్ ఆచంట కీలకపాత్రలు పోషించారు. మరి థియేటర్స్‌లో పెద్దగా అలరించని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎంత అలరిస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా, లక్ష్యం కోసం పోరాడే యువకుడిగా, ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేని ప్రేమికుడిగా దినేష్ తేజ్ మెప్పించారు. ఇక ఫస్ట్ హాఫ్ లో పాయల్ రాధాకృష్ణ తన అందాలతో, పల్లెటూరి అమ్మాయిలా ఆకట్టుకుంటే, సెకండ్ హాఫ్ హెబ్బా పటేల్ మరింత అందాలు ఒలికిస్తూనే హీరోని మోటివేట్ చేసే పాత్రలో కనిపించారు.
ఇక కథ విషయానికి వస్తే.. ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయ దివ్య (పాయల్).. సాధారణ కుటుంబానికి చెందిన గణేశ్ (దినేశ్ తేజ్) ప్రేమలో పడుతుంది. కానీ దివ్యకు వేరే వ్యక్తితో పెళ్లి నిర్ణయిస్తుంది ఆమె తల్లి. దీంతో తనను ఎక్కిడకైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని గణేశ్ పై ఒత్తిడి తీసుకువస్తుంది. సినీ డైరెక్టర్ కావాలని ఎన్నో కళలు కంటున్న గణేశ్..దివ్యతో పెళ్లి గురించి ఆలోచనలో పడతాడు. ఈ క్రమంలోనే అను (హెబ్బా పటేల్) అతడికి పరిచయం అవుతుంది. అను రాకతో గణేశ్, దివ్య ప్రేమకథలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అనేది సినిమా. ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…