Chanakya Niti : చాణక్య సూత్రాలతో, మనం ఎన్నో విషయాలని నేర్చుకోవచ్చు. ఆచార చాణక్య జీవితంలో చాలా సమస్యలు ఉంటాయని, వాటికోసం ప్రత్యేకించి వివరించడం జరిగింది. ఆచార్య చాణక్య చెప్పిన విషయాలని మనం పాటించినట్లయితే, మంచి పేరు తెచ్చుకోవడమే కాదు. ఏ సమస్య లేకుండా, సంతోషంగా ఉంటాము. పైగా చాణక్య ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చెప్పారు. భార్య భర్తల మధ్య సమస్యల మొదలు ఆర్థిక ఇబ్బందులు ఇలా అనేక రకాల అంశాలు గురించి, చాణక్య ప్రస్తావించారు.
చాణక్యక కచ్చితంగా జంతువుల నుండి, ఈ విషయాలని నేర్చుకోవాలని, వీటిని అలవాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. మరి జంతువుల నుండి, నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి..?, చాణక్య ఏం చెప్పారు అనేది చూద్దాం. పాములకి కాళ్లు ఉండవు. అయినా కూడా అవి పాకుతూ వేటాడుతూ ఉంటాయి. బలహీనతను ఎవరు చూడనివ్వకూడదు అని చాణక్య అన్నారు. మీకు ఒక బలహీనత ఉంటే, మీకున్న మరో బలంతో దానిని మరుగున పడకుండా చేసుకోవాలని చాణక్య అన్నారు. డేగ సాధించడంలో ఎప్పుడు విఫలం అవదు. లక్ష్యాలని నిర్దేశించుకునే ముందు, చాలా ఆలోచిస్తుంది. పరిస్థితికి అనుకూలంగా వ్యవహరిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తుంది. మనిషి కూడా డేగ నుండి ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి.
అప్పుడు కచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఇక సింహం నుండి కూడా, ఒక విషయాన్ని నేర్చుకోవాలని చాణక్య అన్నారు. సింహం వేటాడే ముందు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. వేటాడబోయే జంతువు చిన్నదైనా, పెద్దదైనా సింహం యొక్క కృషి ఒకేలా ఉంటుంది. అలానే, పని చిన్నదైనా పెద్దదైనా కూడా ఒకే తరహాలో మనం ఏకాగ్రత పెట్టాలి శ్రద్ధతో పని చేస్తే సింహంలానే మనం కూడా అనుకున్నది చేయగలము అని చాణక్య అన్నారు.
గాడిదలు ఎంత బరువైనా కూడా మోస్తాయి. ఎంత దూరమైనా కూడా అలసట లేకుండా బరువుని మోయగలుగుతాయి. వాటి బలాబలాల గురించి యజమానికి తెలిసినంతగా దానికి తెలియదు. అందుకని ఎప్పుడు ఒకరి కింద పని చేస్తూ బానిసత్వాన్ని భరిస్తాయి. మనిషి ఎప్పుడూ కూడా అలా ఉండకూడదని, చాణక్య అన్నారు. ఇలా జంతువుల నుండి మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…