Renu Desai : రేణూ దేశాయ్‌కి త‌న మాజీ భ‌ర్త‌ని గుర్తు చేసిన అకీరా.. ఆ మూమెంట్స్ చూసి ఎమోష‌న‌ల్

December 11, 2023 1:41 PM

Renu Desai : రేణూ దేశాయ్.. ఆమె ఒక న‌టిగా, మ‌ల్టీ టాలెంట్ ఉన్న మ‌హిళ‌గా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. రేణ దేశాయ్ సినిమాల‌కి దూర‌మైన కూడా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి ఎప్ప‌టికి ద‌గ్గర‌గానే ఉంటుంది. అయితే రేణూ దేశాయ్ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రంతో రీఎంట్రీ ఇవ్వ‌గా, ఇందులో హేమ‌ల‌త ల‌వ‌ణం అనే పాత్ర‌లో న‌టించి మెప్పించింది. సినిమా అంత హిట్ కాక‌పోయిన ఆమె ప‌ర్‌ఫార్మెన్స్ కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అయితే డిసెంబ‌ర్ 4న రేణూ దేశాయ్ బ‌ర్త్ డే కాగా, ఆమెకి అదిరిపోయే గిఫ్ట్ అందించాడు అకీరా నందన్. అకీరా త‌న త‌ల్లి మాదిరిగానే మ‌ల్టీ టాలెంటెడ్. ఆటల్లో మేటి.. చదువుల్లో ఫష్ట్.. ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లోనూ ముందుంటాడు. పియానో వాయిస్తాడు.. బాస్కెట్ బాల్ ఆడేస్తుంటాడు. ఇప్పుడు విదేశాల్లో సినిమా, మ్యూజిక్ అంటూ కోర్సులు నేర్చుకుంటాడు.

ఇప్పుడు అకిరా నందన్ ఎడిటింగ్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. త‌ల్లి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ వీడియోని ఎడిట్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చాడు. జానీ సినిమాలోని సీన్లను, షాట్స్‌ను ఎడిట్ చేయ‌గా, అందులో రేణూ దేశాయ్ కనిపించే షాట్లను ఎక్కువ పెట్టి.. పవన్ కళ్యాణ్‌తో కనిపించే షాట్లను రెండు మూడు యాడ్ చేశాడు. ఇక ఈ ఎడిట్‌కు సప్త సాగరాలు దాటి మూవీలోని సాంగ్‌ను బ్యాక్ గ్రౌండ్‌లో పెట్టేశాడు. త‌న‌యుడు ఇచ్చిన గిఫ్ట్‌ని రేణూ దేశాయ్ చాలా లేట్‌గా షేర్ చేసింది. తాజాగా నా కొడుకు ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఇది అంటూ రేణూ మురిసిపోతూ ఓ వీడియో షేర్ చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

akira nandan special gift to Renu Desai on her birth day
Renu Desai

అమ్మ కోసం అకిరా చేసిన ఈ వీడియో మీద నెటిజన్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. అమ్మానాన్నలు అంటే అకిరాకు ఎంత ప్రేమో ఈ వీడియోను చూస్తేనే అర్థం అవుతోంది. ఈ వీడియో చాలా బాగా ఎడిట్ చేశావంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం వీడియో అయితే సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. సాధార‌ణంగా అకీరా అప్పుడప్పుడు త‌న త‌ల్లికి ఏదో ర‌కంగా స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉంటాడు.. ఆ మధ్య రేణూ దేశాయ్‌కి ఇష్టమైన పాటను పియానో ద్వారా వినిపించాడు. అది విని రేణూ చాలా మురిసిపోయింది. అయితే ప‌వ‌న్ నుండి విడిపోయాక మ‌రో పెళ్లి చేసుకోని రేణూ దేశాయ్ పిల్ల‌లే త‌న ప్రాణంగా జీవిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now