Akhanda Movie : నందమూరి బాలకృష్ణ అభిమానుల దాహం తీర్చాడు. అఖండతో గురువారం టాలీవుడ్‌లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ అఖండ రోరింగ్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. కోవిడ్ తాకిడితో గత కొన్ని నెలలుగా సందడి లేని థియేటర్లు.. ఇప్పుడు జై బాలయ్య అని జపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ అఖండ ఫీవర్ కనిపిస్తోంది. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరూ సినిమాను ఆస్వాదిస్తున్నారు. గత రెండేళ్లుగా డీలా పడ్డ థియేటర్ల యాజమానులకు, దర్శక నిర్మాతలకు అఖండ సినిమా బూస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఓవర్సీస్లో అత్యధిక ప్రీమియర్ గ్రాసర్ గా అఖండ నిలిచింది.
ఏకంగా మూడు లక్షల డాలర్లకు పైగా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే రాబట్టింది. అయితే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో బాలకృష్ణ అండ్ టీం తెగ సంతోషిస్తోంది. తాజాగా బాలకృష్ణ తన డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ఇతర చిత్రబృందంతో కలిసి ఏఎంబీ మాల్‌లో సినిమా వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…