Akhanda Movie : రోరింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్.. ఏఎంబీ మాల్‌లో సినిమా వీక్షిస్తున్న బాల‌కృష్ణ‌..

December 2, 2021 8:12 PM

Akhanda Movie : నందమూరి బాలకృష్ణ అభిమానుల దాహం తీర్చాడు. అఖండతో గురువారం టాలీవుడ్‌లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. సింహా, లెజెండ్‌ తర్వాత బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ అఖండ రోరింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా నిలిచింది. కోవిడ్‌ తాకిడితో గత కొన్ని నెలలుగా సందడి లేని థియేటర్లు.. ఇప్పుడు జై బాలయ్య అని జపిస్తున్నాయి.

Akhanda Movie balakrishna watched it in amb mall

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ అఖండ ఫీవర్‌ కనిపిస్తోంది. మాస్‌, క్లాస్‌ అని తేడా లేకుండా అందరూ సినిమాను ఆస్వాదిస్తున్నారు. గత రెండేళ్లుగా డీలా పడ్డ థియేటర్ల యాజమానులకు, దర్శక నిర్మాతలకు అఖండ సినిమా బూస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఓవర్సీస్‏లో అత్యధిక ప్రీమియర్ గ్రాసర్ గా అఖండ నిలిచింది.

ఏకంగా మూడు లక్షల డాలర్లకు పైగా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే రాబట్టింది. అయితే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చిన నేప‌థ్యంలో బాల‌కృష్ణ అండ్ టీం తెగ సంతోషిస్తోంది. తాజాగా బాల‌కృష్ణ త‌న డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్, ఇత‌ర చిత్ర‌బృందంతో క‌లిసి ఏఎంబీ మాల్‌లో సినిమా వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now