వినోదం

అదితి రావు, సిద్ధార్థ్ పెళ్లి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుందా.. వారు ఏమ‌ని అంటున్నారు..!

ఒక‌ప్ప‌టి టాలీవుడ్ ల‌వ‌ర్ బోయ్ సిద్ధార్థ్ మరియు అందాల భామ అదితి రావ్ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆ మ‌ధ్య ప‌లు చోట్ల జంట‌గా క‌నిపించిన వీరు శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి జంట‌గానే వ‌చ్చారు. దీంతో ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారంపై మళ్లీ రూమర్స్ ఊపందుకున్నాయి. వీరు ఒకే టైప్ షర్ట్ లు వేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టి అందరికీ మరికొంత క్లారిటీ ఇస్తూ వచ్చారు. అయితే 2009 సంవత్సరంలోనే బాలీవుడ్ నటుడు సత్యదీప్‌ మిశ్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది అదితిరావు హైదరీ. అయితే ఈ పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. 2013లో వీరు విడిపోయారు. అప్పటినుంచి ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తూ వస్తున్నారు.

ఇక సిద్ధార్థ్ సైతం 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకోగా, 2007లో విడాకులు ఇచ్చేసారు. ఆ తర్వాత కొన్నాళ్ళు సింగిల్ గా ఉన్న సిద్దార్థ్.. మహాసముద్రం సినిమాతో అదితి మాయలో పడ్డట్టు టాక్. వీరు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి. అయితే ‘ఇద్దరం రిలేషన్ లో ఉన్న మాట నిజమే గానీ పెళ్లి మా ఇద్దరికీ కలిసి రాలేదు’ అని వారిద్ద‌రు సన్నిహితుల దగ్గర వెల్లడించినట్లు సమాచారం. దీంతో వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటారా? లేకుంటే ఇలానే ఉంటూ కాలం వెళ్ల‌దీస్తారా అనేది తెలియాల్సి ఉంది.

రీసెంట్ గానే అదితిరావు హైదరీ మాజీ భర్త సత్యదీప్‌ మిశ్రా రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. వివియన్‌ రిచర్డ్స్‌ కుమార్తె మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు సిద్దార్థ్ తో అదితి రిలేషన్ అనే టాపిక్ నడుస్తున్న వేళ ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేశారు సత్యదీప్. అదితితో నా రిలేషన్‌ కారణంగా.. నాకు ప్రేమ మీదే విరక్తి కలిగింది. మరోసారి ప్రేమలో పడటం అంటేనే భయం వేసింది. బ్రేకప్‌ అనుభవం ఎదురైన వాళ్లు.. మళ్లీ రిలేషన్‌, ప్రేమ అంటేఎంతో భయపడతారు.. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం అని అదితి మాజీ భర్త సత్యదీప్ చెప్పుకొచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM