Actor Nikhil : పెళ్లైన నాలుగేళ్ల‌కి గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న నిఖిల్.. తండ్రి కాబోతున్నాడా అంటూ చ‌ర్చ‌..

November 13, 2023 9:43 PM

Actor Nikhil : టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. ఆయ‌న కెరీర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న స‌మ‌యంలో ప‌ల్ల‌వి అనే డాక్ట‌ర్‌ని వివాహం చేసుకున్నారు. 2020లో కోవిడ్ మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో వీరు కరోనా నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని ఇద్దరూ ఖండించారు. అయితే ఇదిలా త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో నిఖిల్‌కి సంబంధించిన వార్త ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

నిఖిల్ త్వర‌లో తండ్రి కాబోతున్నాడు. నిఖిల్ భార్య గర్భవతి అంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న నిఖిల్ భార్య డాక్టర్ పల్లవి బేబీ బంప్‌తో కనిపించిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పల్లవి గర్భవతి అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ విష‌యంపై నిఖిల్ మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక‌ ప్రకటన చేయలేదు.

Actor Nikhil might becoming father
Actor Nikhil

పెళ్ళై నాలుగేళ్లు అవుతుండగా నిఖిల్-పల్లవి స్వీట్ న్యూస్ చెప్పనున్నారని తెగ ప్ర‌చారాలు జ‌రుగుతుంది.ఇటీవ‌ల నిఖిల్‌, ప‌ల్ల‌వి ఇద్దరూ జంటగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారిపై వ‌చ్చే త‌ప్పుడు వార్త‌లని ఖండించారు. నిఖిల్ హ్యాపీ డేస్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రాలు ఫేమ్ తెచ్చాయి. కార్తికేయ 2 ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. నిఖిల్ గత చిత్రం స్పై నిరాశపరిచింది… హీరో నిఖిల్ స్వయంభు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా. స్వయంభులో ఆయన లాంగ్ హెయిర్ తో కనిపించనున్నారు. కత్తి సాము వంటి యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా మూవీగా స్వయంభు భారీగా విడుదల కానుంది. స్వయంభు నిఖిల్ 20వ చిత్రంగా విడుదల అవుతుంది. చిత్రంలో నిఖిల్ కి జంటగా సంయుక్త మీనన్ నటించనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now