A Ranjith Cinema OTT Streaming : మలయాళంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులని ఫుల్ థ్రిల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే రీసెంట్‌గా వచ్చిన మరో సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఎ రంజిత్. ఈ చిత్రం డిసెంబర్ 8న థియేటర్స్ లోకి వచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇందులో ఆసిఫ్ అలీ, సైజు కురుప్, అన్సన్ పాల్, నమిత ప్రమోద్, హన్నా రేగి కోసి మరియు జ్యువెల్ మేరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది.తెలుగులో 18 ఏళ్ల కింద వచ్చిన ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రం మాదిరిగా ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అయితే నిషాంత్ సత్తు డైరెక్షన్‌లో రూపొందిన ఎ రంజిత్ చిత్రంలో కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ తోపాటు ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ కట్టిపడేశాయి. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం. నెట్ ఫ్లిక్స్‌లో శుక్రవారం (డిసెంబర్ 29) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తుంది. చిన్న బడ్జెట్ తో మంచి సినిమాలు తీస్తూ.. డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో మలయాళ సినిమాలు ఎంతగానో అలరిస్తున్నాయి.. ఈ క్రమంలోనే ఎ రంజిత్ చిత్రం కూడా ఉంది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. పెద్ద ఫిల్మ్ మేకర్ కావాలని కలలు కనే రంజిత్ (ఆసిఫ్ అలీ) అనే వ్యక్తి తన సినిమా కోసం రెండు స్క్రిప్ట్ లు రాసుకోవాలని భావిస్తుంటాడు.
ఈ రెండు కథలలో ఒకటి హాజనిత స్టోరీ కాగా.. మరొకటి తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రాసుకోవాలని భావిస్తాడు. అయితే తాను రాసుకున్న ఊహాజనిత ఘటనలే తన జీవితంలో జరుగుతుండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. క్రిమినల్ కేసులోను అతను ఇరుక్కుంటూ ఉంటాడు. మరోవైపు సన్నీ (సైజు కురుప్) అనే ఓ వ్యాపారవేత్త కూడా రంజిత్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాడు. దీంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటాడు. కథలో ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు చోటు చేసుకుంటాయి. ప్రతి సన్నివేశం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…