A Ranjith Cinema OTT Streaming : మ‌ళ‌యాళ‌ సైకాలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ఓటీటీలో సంద‌డికి సిద్ధం

December 29, 2023 7:37 PM

A Ranjith Cinema OTT Streaming : మ‌లయాళంలో వచ్చిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఫుల్ థ్రిల్ చేస్తుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే రీసెంట్‌గా వ‌చ్చిన మరో సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ఎ రంజిత్. ఈ చిత్రం డిసెంబర్ 8న థియేట‌ర్స్ లోకి వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇందులో ఆసిఫ్ అలీ, సైజు కురుప్, అన్సన్ పాల్, నమిత ప్రమోద్, హన్నా రేగి కోసి మరియు జ్యువెల్ మేరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది.తెలుగులో 18 ఏళ్ల కింద వచ్చిన ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రం మాదిరిగా ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

అయితే నిషాంత్ స‌త్తు డైరెక్ష‌న్‌లో రూపొందిన ఎ రంజిత్ చిత్రంలో కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ తోపాటు ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ కట్టిపడేశాయి. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి రావ‌డం విశేషం. నెట్ ఫ్లిక్స్‌లో శుక్రవారం (డిసెంబర్ 29) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ మూవీకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. చిన్న బడ్జెట్ తో మంచి సినిమాలు తీస్తూ.. డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో మ‌ల‌యాళ సినిమాలు ఎంత‌గానో అల‌రిస్తున్నాయి.. ఈ క్ర‌మంలోనే ఎ రంజిత్ చిత్రం కూడా ఉంది. ఈ చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. పెద్ద ఫిల్మ్ మేకర్ కావాలని కలలు కనే రంజిత్ (ఆసిఫ్ అలీ) అనే వ్యక్తి తన సినిమా కోసం రెండు స్క్రిప్ట్ లు రాసుకోవాలని భావిస్తుంటాడు.

A Ranjith Cinema OTT Streaming know the platform details
A Ranjith Cinema OTT Streaming

ఈ రెండు క‌థ‌ల‌లో ఒక‌టి హాజనిత స్టోరీ కాగా.. మరొకటి తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రాసుకోవాలని భావిస్తాడు. అయితే తాను రాసుకున్న ఊహాజనిత ఘటనలే తన జీవితంలో జ‌రుగుతుండ‌డం అత‌నికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. క్రిమినల్ కేసులోను అత‌ను ఇరుక్కుంటూ ఉంటాడు. మరోవైపు సన్నీ (సైజు కురుప్) అనే ఓ వ్యాపారవేత్త కూడా రంజిత్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాడు. దీంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటాడు. క‌థ‌లో ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు చోటు చేసుకుంటాయి. ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now