తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్..

August 11, 2021 1:14 PM

తెలంగాణలోని అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ  క్రమంలోనే హైదరాబాద్ లక్డీకపూల్‌లోని పోలీస్ నియామక మండలి ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఖాళీగా ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు ఆగస్టు 11 ఉదయం ఎనిమిది గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులను అందజేయడానికి ఆగస్టు 29వ తేదీ ఆఖరి తేదీ. ఈ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నందు చూడవచ్చు.
https://www.tslprb.in/

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ పూర్తిచేసి సంబంధిత న్యాయవాద రంగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 2021 జులై 21 నాటికి అభ్యర్థుల వయస్సు 34 సంవత్సరాలకు మించకూడదు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.750 మాత్రమే. అభ్యర్థులు ఆగస్టు 29వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment