Paytm Jobs: పేటీఎంలో జాబ్స్‌.. 10వ త‌ర‌గ‌తి చాలు.. నెల‌కు రూ.35వేలు సంపాదించుకునే అవ‌కాశం..

August 1, 2021 10:16 PM

Paytm Jobs: కోవిడ్ నేప‌థ్యంలో ఉద్యోగాల‌ను, ఉపాధిని కోల్పోయిన వారికే కాదు.. ఔత్సాహికుల‌కు కూడా ప్ర‌ముఖ డిజిట‌ల్ వాలెట్ సంస్థ పేటీఎం చ‌క్క‌ని అవ‌కాశాన్ని అందిస్తోంది. కేవ‌లం 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉంటే చాలు.. నెల‌కు రూ.35వేల వ‌ర‌కు సంపాదించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. వారికి అద్భుత‌మైన ఉద్యోగావ‌కాశాల‌ను అందిస్తోంది.

paytm jobs 10th pass can earn rs 35000 per month

పేటీఎంలో దేశవ్యాప్తంగా ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోనున్నారు. ఈ ఉద్యోగానికి 10వ త‌ర‌గ‌తి చ‌దివి ఉంటే చాలు. ఇంట‌ర్‌, డిగ్రీ చ‌దివిన వారు కూడా ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. దీనికి గాను మొత్తం 20వేల ఉద్యోగాల‌ను భర్తీ చేయ‌నున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

పేటీఎం నియ‌మించుకునే ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగం పొందితే నెల‌కు రూ.35వేలు సంపాదించుకోవ‌చ్చు. వేత‌నం + క‌మిష‌న్ క‌లిపి ఆ మొత్తం వ‌స్తుంది. మ‌హిళ‌లు కూడా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఇక సొంత వాహనం ఉంటే ఉద్యోగం ల‌భించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ ఉద్యోగులు పేటీఎంకు చెందిన‌ క్యూఆర్‌ కోడ్, పీఓఎస్ యంత్రాలు, సౌండ్‌ బాక్స్‌, వ్యాలెట్‌, యూపీఐ, పోస్ట్‌పెయిడ్‌, రుణాలు, ఇన్సూరెన్స్‌లు వంటి ఫీచ‌ర్ల‌పై వినియోగ‌దారుల‌కు, వ్యాపారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగుల‌కు వేత‌నంతోపాటు వారు చేసే ప్ర‌ద‌ర్శ‌న‌ను బ‌ట్టి క‌మిష‌న్ కూడా ల‌భిస్తుంది. ఇక మ‌రిన్ని వివ‌రాల‌కు https://paytm.com/fse అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now