విద్య & ఉద్యోగం

ఎన్‌హెచ్ఏఐ రిక్రూట్‌మెంట్ 2021: 42 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభం.. జీతం రూ.2 ల‌క్ష‌లు..!‌

నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) పలు విభాగాల్లో మొత్తం 42 ఖాళీల‌కు ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. అందుకు గాను nhai.gov.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు అప్లై చేసేందుకు ఏప్రిల్ 12ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ మేనేజ‌ర్, డిప్యూటీ మేనేజ‌ర్‌, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ త‌దిత‌ర పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ ద్వారా భ‌ర్తీ చేస్తారు.

ఎన్‌హెచ్ఏఐ రిక్రూట్‌మెంట్ 2021

  • డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌) – 6 ఖాళీలు
  • మేనేజ‌ర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌) – 24 ఖాళీలు
  • డిప్యూటీ మేనేజ‌ర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌) – 12 ఖాళీలు

అర్హ‌త‌లు

డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ – కామ‌ర్స్ లో బ్యాచిల‌ర్ డిగ్రీ లేదా చార్ట‌ర్డ్ అకౌంటెంట్ లేదా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ స‌ర్టిఫికేష‌న్ లేదా, బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఫైనాన్స్‌)లో మాస్ట‌ర్స్ చేసి ఉండాలి. లేదా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన అకౌంట్స్ సంబంధిత సేవ‌ల్లో 6 ఏళ్లు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి. లెవ‌ల్ 12 వేత‌నం ల‌భిస్తుంది. రూ.78,800 నుంచి రూ.2,09,200 జీతం ఇస్తారు.

మేనేజ‌ర్ – కామ‌ర్స్ లో బ్యాచిల‌ర్ డిగ్రీ లేదా చార్ట‌ర్డ్ అకౌంటెంట్ లేదా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ స‌ర్టిఫికేష‌న్ లేదా, బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఫైనాన్స్‌)లో మాస్ట‌ర్స్ చేసి ఉండాలి. లేదా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన అకౌంట్స్ సంబంధిత సేవ‌ల్లో 4 ఏళ్లు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి. లెవ‌ల్ 11 స్థాయి వేత‌నం ల‌భిస్తుంది. రూ.67,700 నుంచి రూ.2,08,700 వ‌ర‌కు వేత‌నం ఇస్తారు.

డిప్యూటీ మేనేజ‌ర్ – కామ‌ర్స్ లో బ్యాచిల‌ర్ డిగ్రీ లేదా చార్ట‌ర్డ్ అకౌంటెంట్ లేదా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ స‌ర్టిఫికేష‌న్ లేదా, బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఫైనాన్స్‌)లో మాస్ట‌ర్స్ చేసి ఉండాలి. లేదా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన అకౌంట్స్ సంబంధిత సేవ‌ల్లో 4 ఏళ్లు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి. లెవ‌ల్ 10 స్థాయి వేతనం ఇస్తారు. రూ.56,100 నుంచి రూ.1,77,500 వ‌ర‌కు వేత‌నం ఇస్తారు.

nhai.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అభ్య‌ర్థులు పైన తెలిపిన పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 6 గంట‌ల లోగా పంపించాల్సి ఉంటుంది. GM (HR &Admn.)-I A, National Highways Authority of India, Plot No: G – 5&6, Sector – 10, Dwarka, New Delhi – 110075 అనే అడ్ర‌స్‌కు చేరేలా ద‌ర‌ఖాస్తుల‌ను పంపించాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM