వైజాగ్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. 8,10, ఇంటర్ పాసైన అభ్యర్థులకు అవకాశం!

June 30, 2021 9:27 PM

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ అభ్యర్థులకు విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం శుభవార్తను తెలిపింది. ఏపీ లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం, కష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా నుంచి అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆహ్వానం పలుకుతోంది. ఈ ర్యాలీ ద్వారా సోల్జర్‌- జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌- టెక్నికల్‌, సోల్జర్‌- టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌, సోల్జర్‌ – క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ ర్యాలీకి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించాలి.https://joinindianarmy.nic.in/.

ఈ ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థులు కేవలం పై తెలిపిన ఆరు జిల్లాల్లో అభ్యర్థులై ఉండాలి. పోస్ట్ ను బట్టి అభ్యర్థుల అర్హత ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8,10 ఇంటర్ పాస్ అయి ఉండాలి.అభ్యర్థుల వయస్సు సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులకి 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే మిగతా పోస్టులకి 17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ ర్యాలీ వైజాగ్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment