ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఖాళీలన్నింటిని జిల్లాల వారీగా భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు జిల్లాలో ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే పారామెడికల్, ఆప్తాలీక్ అసిస్టెంట్ విభాగాలలో ఖాళీగా ఉన్న 21 పోస్టులను భర్తీ చేయడానికి డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకి అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీ డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.
ఈ ఇంటర్వ్యూ లకు వెళ్లే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపిసి చేసి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పారా మెడికల్, ఆప్తాలీక్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా బీఎస్సీ (ఆప్టోమెట్రీ) లేదా ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. లేదా ఆప్టోమెట్రీలో డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పారా మెడికల్ బోర్డు లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు 2020 డిసెంబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. కాంట్రాక్ట్ విధానంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. నవంబర్ 30వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థులు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేల వేతనం చెల్లించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…