పరస్త్రీపై ఉన్న వ్యామోహంతో కట్టుకున్న భార్యను కానరాని లోకాలకు పంపించాడు. వేరే మహిళపై ఆ తండ్రికి ఉన్న ప్రేమ తన బిడ్డల పాలిట శాపంగా మారింది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా సదరు మహిళ ఎనిమిదేళ్ల చిన్నారిపై దారుణానికి పాల్పడింది. బాలుడికి మొత్తం వాతలు పెట్టిన ఘటన తమిళనాడులోని గుడియాట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
35 ఏళ్ల సెత్తు అనే వ్యక్తి ఈశ్వరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి కాపురంలో ఓ మహిళ చిచ్చు పెట్టింది. సెత్తు మరొక మహిళకు దగ్గరవటం జీర్ణించుకోలేని ఈశ్వరి తన భర్తను హెచ్చరించింది. అయినప్పటికీ తన భర్త పద్ధతిని మార్చుకోక పోవడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఈశ్వరి గత నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
తన భార్య మరణించిన తర్వాత మొసలి కన్నీరు కార్చిన ఆ భర్త ఏకంగా తను ప్రేమించిన మహిళను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ముందు నుంచి ఈశ్వరి, ఆమె పిల్లలు అంటే గిట్టని వేణి ఆ పిల్లల పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించేది. ఈక్రమంలోనే వేణి ఎనిమిదేళ్ల కుమారుడిపై అతి దారుణంగా ప్రవర్తించింది. పసిమనసు అనే జాలి, దయ లేకుండా ఇష్టానుసారంగా బాలుడికి వాతలు పెట్టడంతో 8 ఏళ్ల కుర్రాడు గట్టిగా అరుచుకుంటూ తన పెద్దమ్మ దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్పాడు.
ఈ క్రమంలోనే తన పెద్దమ్మ చికిత్స నిమిత్తం బాలుని ఆస్పత్రికి చేర్పించగా.. ఆపై వేణి, సెత్తులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…