టెలికాం సంస్థ రిలయన్స్ జియో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను బండిల్‌గా కలిగిన కొత్త ప్లాన్లను జియో లాంచ్ చేసింది. ఈ ప్లాన్లను రీచార్జి చేసుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఆ సబ్‌స్క్రిప్షన్ ఎప్పటికీ అలాగే కొనసాగాలంటే ఆ ప్లాన్లను గడువు తీరినకొద్దీ రీచార్జి చేస్తూ ఉండాలి. దీంతో ఆ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
ఇక ఆ సబ్‌స్క్రిప్షన్ ను పొందేందుకు గాను జియో ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.499, రూ.666, రూ.888, రూ.2599, రూ.549 లలో ఏదైనా ఒక ప్లాన్ ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని జియో కొత్తగా ప్రవేశపెట్టింది.
రూ.499 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అలాగే రూ.666 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఉచిత కాల్స్, మెసేజ్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులుగా ఉంది.
రూ.888 ప్లాన్ లో రోజుకు 2జీబీ డేటాను ఇస్తారు. ఉచిత కాల్స్, మెసేజ్ లు వస్తాయి. దీని వాలిడిటీ 84 రోజులుగా ఉంది. రూ.2599 తో రీచార్జి చేస్తే రోజుకు 2జీబీ డేటా, ఉచిత కాల్స్, మెసేజ్ లు వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ఇక వీటితోపాటు డేటా యాడాన్ వేసుకోవచ్చు. దాని విలువ రూ.549. రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. దీంట్లో ఉచిత కాల్స్, మెసేజ్ లు రావు. వాలిడిటీని 56 రోజులుగా నిర్ణయించారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…