ఏపీలో ఖాళీగా ఉన్న 3,211 గ్రామ, వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలు.. జిల్లాల వారిగా వివరాలివే!

June 29, 2021 8:09 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 3,211 గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణత సాధించి స్థానికంగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జిల్లా సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.

జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళం 576, తూర్పుగోదావరి 367, పశ్చిమగోదావరి 432, కర్నూల్ 58, అనంతపురం 14 80, విజయనగరం 298 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పది లేదా ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై అవగాహన ఉండాలి. అలాగే స్థానికంగా ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఒక్కో జిల్లాకు ఒకరోజు చివరితేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ లో చూడవచ్చు.

https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment