SBI లో 6100 ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ ఇలా..!

August 9, 2021 7:57 PM

దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి 6100 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో 125 ఖాళీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో 100 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగిసింది.స్టేట్ బ్యాంక్ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ కి డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హత కావడంతో లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి.

 

ఈ పరీక్షలను ఆగస్టులో నిర్వహించనుంది. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలను ఎలా నిర్వహిస్తారు? ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వస్తే.. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించబడుతుంది. హిందీ, ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాషలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష పేపరు ఉండగా ఒక గంట సమయం ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష రాసిన తర్వాత రాష్ట్రాలు, కేటగిరీల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. స్థానిక భాషలు చదివి రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారు మాత్రమే అప్రెంటిస్ ఉద్యోగాలకు అర్హులు గా ప్రకటించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment