Huzurabad Election: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెరాసకు రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన నియోజకవర్గం అయిన హుజురాబాద్‌లో ఆయనకు వ్యతిరేకంగా తెరాసలో ఎవరు పోటీ చేస్తారు ? అన్న చర్చ బలంగా కొనసాగుతోంది. ఇప్పటికీ తెరాస ఇంకా ఈటలకు పోటీగా ఎవరినీ బరిలో దింపలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఆ దిశగా ఆలోచన చేయడం లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోటీ ఈటలకు, తెరాసకు మధ్యే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. అయితే ఈటల లాంటి బలమైన నాయకున్ని ఎదుర్కొనేందుకు అంతే బలంగా ముందుకు సాగాలి. అందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీమ్‌ను ప్రవేశపెట్టారా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
దళిత బంధు స్కీమ్‌ను దశలవారీగా రాష్ట్రంలో అమలు చేయనున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్‌లో దీన్ని ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. దీంతో వారు తమకు నచ్చిన వ్యాపారం, ఉపాధి కల్పించుకోవచ్చు. దళితుల సాధికారత కోసం ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు గాను తొలి దశ కింద రూ.1200 కోట్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధు స్కీమ్‌ను దశలవారీగా అమలు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 100 కుటుంబాలకు సహాయం అందిస్తారు. ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ స్కీమ్‌ను అమలు చేస్తారు.
అయితే ఈ స్కీమ్‌ను ప్రకటించినప్పటి నుంచి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు తెరాసపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టారని అంటున్నాయి. ఓ సమావేశంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. అయితే ఈ స్కీమ్ వల్ల హుజురాబాద్‌లో తెరాస గెలుపు ఖాయమేనా ? అంటే ఆ విషయం ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే స్కీమ్‌ను అమలు చేసినా అది ఈటల నియోజకవర్గం కనుక, ఆయన బలమైన నేత కనుక ఇంకా అనేక వ్యూహాలను అమలు చేయాలి. ఈ స్కీమ్‌లో డబ్బులు తీసుకున్న వారు కచ్చితంగా తెరాసకు ఓటు వేస్తారన్న గ్యారంటీ లేదు. కానీ మెజారిటీ ప్రజలు ఓటు వేసేందుకు చాన్స్ ఉంది. అదే జరిగితే ఈ ఉప ఎన్నికలో తెరాస పై చేయి సాధిస్తుంది. లేదా ఈటల గెలుస్తారు. మరి ఈ స్కీమ్ అక్కడ తెరాసకు ఓట్లను తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. కానీ తెరాస మాత్రం దళిత బంధుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…