Huzurabad Election: ద‌ళిత బంధుపైనే తెరాస ఆశ‌ల‌న్నీ.. ఆ స్కీమ్ గ‌ట్టెక్కిస్తుందా ?

July 27, 2021 1:46 PM

Huzurabad Election: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెరాస‌కు రాజీనామా చేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన హుజురాబాద్‌లో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా తెరాస‌లో ఎవ‌రు పోటీ చేస్తారు ? అన్న చ‌ర్చ బ‌లంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికీ తెరాస ఇంకా ఈట‌ల‌కు పోటీగా ఎవ‌రినీ బ‌రిలో దింప‌లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌డం లేన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో పోటీ ఈట‌ల‌కు, తెరాస‌కు మ‌ధ్యే ఉంటుంద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఆ విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. అయితే ఈట‌ల లాంటి బ‌ల‌మైన నాయ‌కున్ని ఎదుర్కొనేందుకు అంతే బ‌లంగా ముందుకు సాగాలి. అందుకే సీఎం కేసీఆర్ ద‌ళిత బంధు స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టారా ? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

Huzurabad Election: can dalitha bandhu scheme give votes to trs

ద‌ళిత బంధు స్కీమ్‌ను ద‌శ‌ల‌వారీగా రాష్ట్రంలో అమ‌లు చేయ‌నున్నారు. తొలుత పైల‌ట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్‌లో దీన్ని ప్రారంభిస్తారు. ఈ ప‌థ‌కంలో భాగంగా ఒక్కో ద‌ళిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం అంద‌జేస్తారు. దీంతో వారు త‌మ‌కు న‌చ్చిన వ్యాపారం, ఉపాధి క‌ల్పించుకోవచ్చు. ద‌ళితుల సాధికార‌త కోసం ఈ ప‌థ‌కం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు గాను తొలి ద‌శ కింద రూ.1200 కోట్ల‌ను కూడా అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ద‌ళిత బంధు స్కీమ్‌ను ద‌శ‌ల‌వారీగా అమ‌లు చేయ‌నున్నారు. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల‌కు స‌హాయం అందిస్తారు. ఇక జిల్లా క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ఈ స్కీమ్‌ను అమ‌లు చేస్తారు.

అయితే ఈ స్కీమ్‌ను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు తెరాస‌పై ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నాయి. కేవ‌లం హుజురాబాద్ ఉప ఎన్నిక కోస‌మే ఈ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని అంటున్నాయి. ఓ స‌మావేశంలో సీఎం కేసీఆర్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని ప‌రోక్షంగా అంగీక‌రించారు. అయితే ఈ స్కీమ్ వల్ల హుజురాబాద్‌లో తెరాస గెలుపు ఖాయ‌మేనా ? అంటే ఆ విష‌యం ఇప్పుడే చెప్ప‌లేమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఎందుకంటే స్కీమ్‌ను అమ‌లు చేసినా అది ఈట‌ల నియోజ‌క‌వ‌ర్గం క‌నుక‌, ఆయ‌న బ‌ల‌మైన నేత క‌నుక ఇంకా అనేక వ్యూహాల‌ను అమ‌లు చేయాలి. ఈ స్కీమ్‌లో డ‌బ్బులు తీసుకున్న వారు క‌చ్చితంగా తెరాస‌కు ఓటు వేస్తార‌న్న గ్యారంటీ లేదు. కానీ మెజారిటీ ప్ర‌జ‌లు ఓటు వేసేందుకు చాన్స్ ఉంది. అదే జ‌రిగితే ఈ ఉప ఎన్నిక‌లో తెరాస పై చేయి సాధిస్తుంది. లేదా ఈట‌ల గెలుస్తారు. మ‌రి ఈ స్కీమ్ అక్క‌డ తెరాస‌కు ఓట్ల‌ను తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. కానీ తెరాస మాత్రం ద‌ళిత బంధుపైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now