ఇంటి ముందు ముగ్గు ఎందుకు వెయ్యాలి..? దాని వెనుక ఇంత అర్ధం ఉందా..?

August 30, 2023 5:21 PM

ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ ఇల్లు తుడుచుకుంటూ ఉంటారు. ఇంటి బయట కూడా కచ్చితంగా రోజూ తుడుచుకోవాల‌ని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంటి బయట చెత్తాచెదారం లేకుండా తుడుచుకుని నీళ్లు జల్లి, ముగ్గు పెట్టుకోవాలని కూడా చెప్తూ ఉంటారు. చాలామంది రకరకాల ముగ్గులను వేస్తూ ఉంటారు. ఎంతో అందంగా ఇంటి గుమ్మాన్ని అలంకరించుకుంటూ ఉంటారు. అయితే, అసలు ముగ్గులు ఎందుకు వేయాలి..? ముగ్గుల‌ అర్థం, పరమార్థం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి గడప ముందు ముగ్గుల‌లో భాగంగా 2 గీతల్ని గీస్తూ ఉంటారు. అయితే, ఇలా గీయడం వలన దుష్టశక్తులు రావట. పైగా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. ముగ్గు వేసి నాలుగు వైపులా కూడా రెండేసి అడ్డగీతలు గీస్తూ ఉంటారు. అలా చేయడం వలన శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయట. పండుగల సమయంలో కచ్చితంగా ఇలా ముగ్గు వేసి, అడ్డగీతలు గీయాలి. ఏ పూజ చేసుకున్నా కూడా ముందు పీట మీద దేవతని పెట్టేటప్పుడు, ముగ్గు వేయాలి.

why rongoli must draw before home

నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీసుకోవాలి. నక్షత్ర ఆకారంలో వచ్చే గీతాలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలని తొలగిస్తుంది. ఇవేమి మీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. మనం పద్మాన్ని, చుక్కల ముగ్గులు కూడా వేస్తూ ఉంటాము. వాటిలో అనేక కోణాలు ఉంటాయి. అవి గీతలే కాదు. యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర, శాస్త్ర రహస్యలతో కూడి ఉండడం వలన మనకి ఎటువంటి చెడు శక్తులు కలగకుండా, మనకి ఎలాంటి హాని కూడా కలగకుండా అవి చూస్తాయి.

అందుకనే అసలు ముగ్గు ని తొక్కకూడదని చెప్తూ ఉంటారు. తులసి మొక్క దగ్గర అయితే, అష్టదళ పద్మం వేసి, దీపారాధన చేస్తే మంచిది. నూతన వధూవరులు మొదటిసారి భోజనం చేసేటప్పుడు, చుట్టుపక్కల లతలు, పుష్పాలు, తీగలతో ఉన్న ముగ్గులను వేయాలి. ఓం, స్వస్తిక్, శ్రీ వంటి కలిగిన ముగ్గులు వెయ్యద్దు. ఎందుకంటే వాటిని అస్సలు తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలో అమ్మవారు, శ్రీమహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆమెకి ఏడు జన్మల వరకు వైధవ్యం ఉండదు. సుమంగళిగానే చనిపోతుంది అని దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment