Lord Shiva : చాలా మంది శివుడిని ఆరాధిస్తారు. ప్రత్యేకించి సోమవారం నాడు శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. నేటికీ మన దేశంలో చాలా చోట్ల శివాలయాలు ఉన్నాయి. వేదాలలో శివుడిని రుద్రుడిగా చెప్పారు. పరమశివుడి ఆకృతిలో ఒక్కో దానికి కూడా ఒక్కో అర్థం ఉంటుంది. శివుడి త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. శివుడి శిరస్సుకి అలంకరించిన చంద్రవంక మనో నిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. ఢమరుకం అయితే బ్రహ్మస్వరూపం.
శివుడి దేహం మీద ఉండే సర్పాలు భగవంతుని జీవాత్మలు గాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని వదిలిపెట్టమని సూచిస్తాయి. అయితే పరమశివుడు పులి చర్మాన్ని కూడా ధరిస్తాడు. పులి చర్మాన్ని ఎందుకు పరమశివుడు ధరిస్తాడు అనే దాని వెనుక కారణం చాలా మందికి తెలీదు. మరి ఎందుకు పరమశివుడు పులి చర్మాన్ని ధరిస్తాడు అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. శివుడు శ్మశానంలో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన వెళ్తుండగా మునికాంతలు ఆయనని చూసి, చూపు తిప్పుకోలేకపోయారు. ఆయనని చూడాలని ముని కాంతలలో కాంక్ష పెరిగింది.
ఆయననే తలుచుకుంటూ ఉంటారు. హఠాత్తుగా తమ భార్యల్లో ఇలాంటి మార్పు వచ్చిందని మునులు వెతుకుతుండగా పరమశివుడిని చూడగానే సమాధానం దొరుకుతుంది. అయితే ఆ దిగంబరుడు సదా శివుడు అని మర్చిపోయి, సంహరించడానికి ఒక ప్లాన్ వేసారు. మునులు స్వామి నడిచే దారిలో ఒక గుంతను తవ్వారు. అయితే ఆ గుంత దగ్గరికి శివుడు రాగానే తపఃశక్తితో వారు ఒక పులిని సృష్టించి శివుడి మీదకి ఉసిగొల్పారు.
శివుడు సునాయసంగా పులిని సంహరించాడు. మునులు ఎందుకు ఇలా చేశారు అనే దాని వెనక అర్థం తెలుసుకొని, ఆ పులి తోలుని కప్పుకున్నాడు శివుడు. అది చూసి మునులు శివుడు శక్తివంతుడు అని తెలుసుకుని, శివుడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు. ఇలా పులి చర్మాన్ని అప్పటి నుండి శివుడు ధరిస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…