Marriage : ఒక పెళ్లితో రెండు కుటుంబాలు, రెండు మనసులు ఏకమవుతాయి. పెళ్లి అంటే చాలా ఉంటాయి. పద్దతి ప్రకారం తంతులని జరుపుతారు. పెళ్లిలో ఎన్నో తంతులు ఉంటాయి. తలంబ్రాలు, మాంగళ్యధారణ, సుముహూర్తం, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఇలా ఎన్నో. అయితే చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే, పెళ్లిలో ఎందుకు మూడు ముళ్ళు వెయ్యాలి..? మూడే ముళ్ళు ఎందుకు వేయాలి, మూడుకి ఎందుకు అంత ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు..? మరి ఇక ఈ విషయాన్నే చూద్దాం.
ప్రాచీన కాలం నుండి కూడా, మూడుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుళ్ళకి సంబంధించి చూస్తే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు. అలానే సృష్టి పరంగా చూసినట్లయితే సృష్టి, స్థితి, లయలు మూడు. ఆధ్యాత్మికపరంగా చూసుకున్నట్లయితే, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక శాంతులు మూడు. యాగానికి కావాల్సిన ఆగ్నలు కూడా మూడు.
అలానే తాంబూలంలో ఆకు, వక్క, సున్నం మూడు. యజ్ఞోపవీతంలో పోగులు మూడు. ఒక్కో పోగులోని లోపలి పోగులు మూడు. బ్రహ్మ సూత్రంలోని ముడులు కూడా మూడు. ధర్మ, అర్ధ, కామము అనే మూడింటితో మోక్షాన్ని పొందొచ్చు. మంగళసూత్రపు పేటలు మూడు. ముడులు కూడా మూడు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మూడు శరీరాలు ఉంటాయి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు.
మాంసం, రక్తం, ఎముకలు ఈ మూడింటినీ కూడా శరీరం కప్పుతుంది. ఇలా మనిషికి మూడు శరీరాలు ఉన్నాయి. కనుక మూడు శరీరాలకు కూడా మూడు ముడులు వేస్తారు. అందుకే వివాహం సమయంలో వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేయడం జరుగుతుంది. ఎప్పటి నుండో కూడా ఇలా వివాహ పద్ధతులని మన పూర్వీకులు పాటిస్తున్నారు. వాళ్ళు పాటించినవి ఇప్పుడు మనము కూడా పాటిస్తున్నాం. ఈ పురాతన పద్ధతులని మనమే రాబోయే తరాల వాళ్లకి కూడా చెప్పాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…