Almonds Tea : చాలా మంది ప్రతి రోజు బాదం పప్పుని తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యానికి బాదం చాలా మేలు చేస్తుందని రోజూ కొన్ని బాదం గింజల్ని నానబెట్టుకుని తీసుకుంటుంటారు. నానబెట్టిన బాదంని ఉదయాన్నే తీసుకోవడం వలన అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అయితే ఈ విషయం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. నానబెట్టిన బాదంని ఉదయాన్నే తినడం వల్ల చాలా ప్రయోజనాలని పొందచ్చని అందరికీ తెలిసిందే. అయితే బాదం టీ వలన కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది.
బాదంపప్పులో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. బాదం పప్పును తీసుకోవడం వలన గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. మెగ్నీషియం కూడా ఇందులో ఉంటుంది. బాదం తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా బాదం బాగా ఉపయోగపడుతుంది. బాదం టీ ని తీసుకోవడం వలన ఫైబర్, ప్రోటీన్, మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తోపాటు ఇతర పోషకాలను కూడా మనం పొందవచ్చు.
బాదం టీ ని మనం ఇన్ఫెక్షన్ల సమయంలో తీసుకున్నట్లయితే కోల్పోయిన పోషకాలని పొందవచ్చు. బరువు తగ్గే వాళ్ళు కూడా బాదం టీ ని తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి చక్కటి ప్రయోజనం కలుగుతుంది. బాదంలో చక్కటి పోషకాలు ఉంటాయి. బాదం టీ ని తీసుకుంటే విటమిన్ ఈ మీకు కావాల్సినంత దొరుకుతుంది. విటమిన్ ఈ శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. బాదం టీ ని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. కొవ్వుని తగ్గించేందుకు కూడా ఇది సహాయపడుతుంది. ఆకలిని కూడా బాగా తగ్గిస్తుంది.
గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక మనం బాదం టీ ని ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని చూసేద్దాం. చాలా మందికి బాదం టీ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలియదు. బాదం టీ ని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందు కొన్ని బాదం పప్పుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. తర్వాత రోజు బాగా నానిన బాదంపప్పులని తొక్క తీసి, ఎండలో బాగా ఆరబెట్టి బాదం పప్పుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని నీటిలో వేసి మరిగించుకుని ఆ నీళ్ళని తాగితే సరిపోతుంది. ఇలా రోజుకి ఒక కప్పు నిద్ర లేవగానే తాగొచ్చు.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…