నిద్రపోతే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే నిద్రకి ముందు అలానే నిద్రలేచిన తర్వాత దేవుడిని స్మరిస్తే, చక్కటి శాంతి మనకి లభిస్తుంది. శారీరిక, మానసిక ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ప్రతిరోజు మనం నిద్రపోతూ ఉంటాము. అన్ని జీవులు కూడా నిద్రపోతూ ఉంటాయి. అయితే దైవాన్ని నమ్మే ప్రతి మనిషి కూడా నిద్రపోవడానికి ముందు, నిద్ర లేవగానే దైవాన్ని స్మరించాలి. ఏ పని చేసినా కూడా మనం దైవనామస్మరణ చేయాలి.
దీనివలన శాంతి లభిస్తుంది. మానసిక, శారీరక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇక ఏ దేవుళ్ళని స్మరించుకోవాలి అనే విషయానికి వచ్చేద్దాం.. నిద్రించే ముందు శివుడిని స్మరించుకుంటే, చాలా మంచిది. ఓం నమశ్శివాయ అని శివుడిని ధ్యానిస్తూ నిద్రలోకి వెళ్లాలి. శివుడు లయకారుడు. శివుడిని స్మరిస్తూ, నిద్రలోకి వెళ్తే.. పీడకలలు ఏమీ కూడా రావు. హాయిగా నిద్రపోవచ్చు. అదే విధంగా నిద్రలేచిన వెంటనే, మనసులో విష్ణు నామాన్ని స్మరించుకోవాలి.
విష్ణువు అంటే స్థితికారుడు. మనల్ని రోజంతా క్షేమంగా, ఆనందంగా విష్ణువు ఉంచుతాడు. కనుక విష్ణువుని స్మరిస్తూ మేల్కొనడం మంచిదని పండితులు అంటున్నారు. ఏదో ఒక విష్ణు మంత్రాన్ని జపిస్తూ నిద్రలేస్తే చాలా మంచి జరుగుతుంది. నారాయణుడు మనల్ని రోజంతా భద్రంగా కాపాడుతాడు. నిద్ర మేల్కొన్న తర్వాత కళ్ళు తెరిచే ముందు రెండు అరచేతులు రాపిడి చేసుకోవాలి.
తర్వాత కళ్ళ మీద చేతులతో అద్దుకోవాలి. ఆ తర్వాత అరచేతుల్లోకి చూసుకుంటూ, కళ్ళు విప్పాలి. అరచేతుల్లో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవులు కొలువై ఉంటారు. ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉండొచ్చు. చూశారు కదా నిద్రకి ముందు, నిద్రలేచిన తర్వాత ఏం చేయాలో.. మరి ఇక ఈ విధంగా పాటించి, ప్రశాంతంగా ఉండండి. రోజంతా కూడా సంతోషంగా ఉండండి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…