నిద్రించే ముందు, నిద్ర లేచాక‌.. ఏయే దేవుళ్ల‌ను స్మ‌రించుకుంటే.. ఏం జ‌రుగుతుంది..?

August 29, 2023 7:11 PM

నిద్రపోతే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే నిద్రకి ముందు అలానే నిద్రలేచిన తర్వాత దేవుడిని స్మరిస్తే, చక్కటి శాంతి మనకి లభిస్తుంది. శారీరిక, మానసిక ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ప్రతిరోజు మనం నిద్రపోతూ ఉంటాము. అన్ని జీవులు కూడా నిద్రపోతూ ఉంటాయి. అయితే దైవాన్ని నమ్మే ప్రతి మనిషి కూడా నిద్రపోవడానికి ముందు, నిద్ర లేవగానే దైవాన్ని స్మరించాలి. ఏ పని చేసినా కూడా మనం దైవనామస్మరణ చేయాలి.

దీనివలన శాంతి లభిస్తుంది. మానసిక, శారీరక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇక ఏ దేవుళ్ళని స్మరించుకోవాలి అనే విషయానికి వచ్చేద్దాం.. నిద్రించే ముందు శివుడిని స్మరించుకుంటే, చాలా మంచిది. ఓం నమశ్శివాయ అని శివుడిని ధ్యానిస్తూ నిద్రలోకి వెళ్లాలి. శివుడు లయకారుడు. శివుడిని స్మరిస్తూ, నిద్రలోకి వెళ్తే.. పీడకలలు ఏమీ కూడా రావు. హాయిగా నిద్రపోవచ్చు. అదే విధంగా నిద్రలేచిన వెంటనే, మనసులో విష్ణు నామాన్ని స్మరించుకోవాలి.

which god you have to name before sleep

విష్ణువు అంటే స్థితికారుడు. మనల్ని రోజంతా క్షేమంగా, ఆనందంగా విష్ణువు ఉంచుతాడు. కనుక విష్ణువుని స్మరిస్తూ మేల్కొన‌డం మంచిదని పండితులు అంటున్నారు. ఏదో ఒక విష్ణు మంత్రాన్ని జపిస్తూ నిద్రలేస్తే చాలా మంచి జరుగుతుంది. నారాయణుడు మనల్ని రోజంతా భద్రంగా కాపాడుతాడు. నిద్ర మేల్కొన్న తర్వాత కళ్ళు తెరిచే ముందు రెండు అరచేతులు రాపిడి చేసుకోవాలి.

తర్వాత కళ్ళ మీద చేతులతో అద్దుకోవాలి. ఆ తర్వాత అరచేతుల్లోకి చూసుకుంటూ, కళ్ళు విప్పాలి. అరచేతుల్లో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవులు కొలువై ఉంటారు. ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉండొచ్చు. చూశారు కదా నిద్రకి ముందు, నిద్రలేచిన తర్వాత ఏం చేయాలో.. మరి ఇక ఈ విధంగా పాటించి, ప్రశాంతంగా ఉండండి. రోజంతా కూడా సంతోషంగా ఉండండి.

god

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment