హిందూ పురాణాల ప్రకారం లోక సంరక్షణార్ధం విష్ణుమూర్తి దశావతారాలను ఎత్తి పాప సంహారం చేసి ధర్మాన్ని కాపాడాడని మనకు తెలిసిందే. ఈ విధంగా విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలలో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించడం వల్ల ఆ రోజున భక్తులందరూ కృష్ణాష్టమిని వేడుకగా, కృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం, వాసుకికి ఎనిమిదవ సంతానంగా, అష్టమి రోజు అంటే కృష్ణపక్షంలో ఎనిమిదవ రోజు శ్రీకృష్ణుడు జన్మించాడు.
ఈ విధంగా కృష్ణుడు అష్టమి రోజు జన్మించడం వల్ల ఈ రోజున కృష్ణాష్టమి వేడుకలుగా పెద్దఎత్తున జరుపుకుంటారు. కృష్ణాష్టమి వేడుకలను ఏవిధంగా జరుపుకోవాలి ? భక్తులు ఎలాంటి నియమాలను పాటించాలి ? అనే విషయానికి వస్తే.. కృష్ణాష్టమి రోజు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కృష్ణుడికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఈ మాసంలో లభించే ప్రత్యేకమైన పండ్లను, వెన్నను, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
మన జీవితంలో మనం చేసిన సకల పాపాలు తొలగిపోవాలంటే కృష్ణాష్టమి రోజు కృష్ణుని పూజించాలి. కృష్ణాష్టమి రోజు ఆవుకు గడ్డి వేసి ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోమాతకు నమస్కారం చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా సంతానం లేని వారు బాలకృష్ణుడిని గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారు రుక్మిణీ కళ్యాణ పారాయణం చేయడం వల్ల వివాహం త్వరగా జరుగుతుంది. ఇకపోతే శ్రీ కృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టం కనుక కృష్ణాష్టమి రోజు ఉట్టికట్టి, ఉట్టి కొట్టే వేడుకలో పాల్గొంటారు. ఈ విధంగా కృష్ణాష్టమి రోజు భక్తులు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…