ఆధ్యాత్మికం

Lord Ganesha : వినాయ‌క చ‌వితి పూజ‌లో వీటిని త‌ప్ప‌క పెట్టాలి..!

Lord Ganesha : ప్రతి ఒక్క‌రు కూడా వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18న వినాయక చవితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుతారు. పెద్ద పెద్ద మండపాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వినాయకుడి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. వినాయక చవితి పూజలో ఇవి తప్పనిసరి అని గుర్తు పెట్టుకోండి.

గణపతి విగ్రహాన్ని మండపాల్లో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంతా రెడీ చేస్తున్నారు. పది రోజుల పాటు వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. వినాయక విగ్రహాన్ని చతుర్దశి రోజున.. ప్రవహిస్తున్న నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12: 39 గంటల నుండి చవితి తిథి మొదలవుతుంది. సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8 గంటలకి ముగిస్తుంది. చాంద్రమానం ప్రకారం తెలుగు వాళ్ళు గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 18న జరుపుకోవాలని పండితులు చెప్పారు.

Lord Ganesha

వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. వినాయకుడికి క‌చ్చితంగా గరికను పెట్టి పూజించండి. అంతా శుభ‌మే జరుగుతుంది. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు ఇష్టం. నైవేద్యంగా ఈ రెండిటిని కచ్చితంగా పెట్టండి. ఈ రెండు పెట్టి మీరు ఇంకేమైనా నైవేద్యాలని పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. కానీ ఈ రెండు అంటే మాత్రం వినాయకుడికి ఎంతో ప్రీతి.

గణేషుడి పూజలో ఎర్రని పూలను ఉపయోగించండి. ఎర్రని మందారాలు వంటివి వాడొచ్చు. ఎర్రటి గులాబీ పూలను కూడా పెట్టొచ్చు. వినాయకుడి అలంకరణలో సింధూరం కూడా ఒకటి. వినాయకుడిని పూజించేటప్పుడు సింధూర తిలకాన్ని దిద్దండి. వడపప్పు, పానకం, చలిమిడి తప్పక పెట్టండి. పూజ సమయంలో నైవేద్యంగా వీటిని వినాయకుడికి సమర్పిస్తే వినాయకుని అనుగ్రహం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM

‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం…

Saturday, 4 April 2026, 12:10 PM

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…

Saturday, 4 April 2026, 10:26 AM

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM