Twin Banana : జంట అరటిపండ్లని తినకూడదా..? ఒకవేళ తింటే ఏం అవుతుంది..?

September 21, 2023 8:40 AM

Twin Banana : అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి పండ్లను తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి. అరటి పండ్లను అందుకే చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అరటి పండ్లను పూజకి కూడా వాడుతూ ఉంటాము. అయితే కొన్ని కొన్ని సార్లు రెండు అరటి పండ్లు అతుక్కుని ఉంటాయి. వాటిని జంట అరటి పండ్లు అని పిలుస్తాము. చాలా మంది ఈ అరటి పండ్లను తినకూడదని, ఇలా ఈ అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని అంటూ ఉంటారు. ఇలా అంటారు కనుక చాలామంది ఇటువంటి అరటి పండ్లను తీసుకోరు.

అయితే అసలు జంట అరటి పండ్లను తీసుకోవచ్చా..?, తీసుకోకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి నిజంగా జంట అరటి పండ్లను తినొచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కవల అరటి పండ్లని పిల్లలు తినకూడదు. పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు. అలాగే దేవుడికి కూడా ఇటువంటి అరటి పండ్లను పెట్టకూడదని అంటూ ఉంటారు. అరటి చెట్టు అంటే ఎవరో కాదు. సాక్షాత్తూ దేవ నర్తకి రంభ అవతారం.

Twin Banana can we eat them or not
Twin Banana

మహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని, అహంకారపూరితంగా వ్యవహరించడం వలన ఆమెని భూలోకంలో అరటి చెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపిస్తాడు. రంభ తన తప్పును తెలుసుకుని ప్రాధేయపడడంతో దేవుడికి నైవేద్యంగా ఉండే అర్హతని ఆమెకి ఇచ్చాడు. అంత పవిత్రమైన అరటిపండ్లలో ఎటువంటి దోషాలని కూడా ఎంచక్కర్లేదు.

కవల అరటి పండ్లను దేవతలకి పెట్టొచ్చు. అందులో తప్పులేదు. కానీ తాంబూలంలో మాత్రం ఇటువంటి అరటి పండ్లను పెట్టకూడదు. ఎందుకంటే ఇవి రెండు పండ్లు అయినా కూడా ఒక పండు కిందే లెక్క వస్తాయి. పైగా చాలా మంది కవల పిల్లలు పుడతారని మంచిది కాదని అంటూ ఉంటారు. అటువంటప్పుడు మనం పెట్టడం వలన ఇతరులకి నచ్చకపోవచ్చు. కాబట్టి తాంబూలంలో పెట్టకుండా ఉండడమే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment