Lakshmi Devi : హిందువుల్లో చాలా మంది తమకు అష్టైశ్వర్యాలు కలగాలని తమకు ఇష్టమైన లక్ష్మీ దేవిని ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే ధనానికి ఆమే అధిపతి. ఎవరికి ఐశ్యర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే అది జరుగుతుంది. కనుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భక్తులు తమ అనుకూలతలు, ఇష్టాలను బట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న లక్ష్మీ దేవి పటాలను, బొమ్మలను పూజిస్తారు. కానీ మీకు తెలుసా..? కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్ర పటాలను పూజిస్తే ధనం రాదట. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుందట. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి పటాలను, బొమ్మలను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లగూబ తెలుసుగా. దానిపై లక్ష్మీ దేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మను పూజించకూడదట. దీంతో అంతా అశుభమే జరుగుతుందట. ధనం వచ్చింది వచ్చినట్టు పోతుందట. తామర పూవుపై లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో కాకుండా కూర్చున్నట్టుగా ఉన్న ఫొటోను పూజించాలట. దీంతో అంతా శుభమే జరుగుతుందట. ఐశ్వర్యం సిద్ధిస్తుందట. గరుత్మంతునిపై విష్ణువుతోపాటు లక్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధనం లభిస్తుందట. అంతా మంచే జరుగుతుందట.
శేషతల్పంపై విష్ణువు పడుకుని ఉండగా, ఆయన కాళ్ల వద్ద లక్ష్మీ దేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట. కుబేరుని విగ్రహం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే దాంతో లక్ష్మీ దేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట. పాదరసంతో తయారు చేసిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని పూజిస్తే దాంతో అన్నీ శుభాలే కలుగుతాయట. ధనం కూడా బాగా సమకూరుతుందట. దీపావళి రోజున స్ఫటిక శ్రీయంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని మీ మనీ లాకర్‌లో పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది.
లక్ష్మీ పూజ చేసేటప్పుడు తులసి ఆకులు, ధూపం, దివ్వెలు, పూవులను ఎక్కువగా వాడి పూజ చేయాలట. దీంతో అనుకున్నది జరుగుతుందట. దీపావళి రోజున లక్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంతరం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీని వల్ల భక్తులకు అనుకున్నది నెరవేరుతుందట. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే, ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా.. అనే మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. దీంతో ఆర్థిక సమస్యలన్నీ పోతాయి. మిక్కిలిగా ధనం సంపాదిస్తారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…