Silver Anklets : మహిళలు పాదాలకు పట్టీలు ధరించడం అన్నది మన భారతీయ సంప్రదాయాల్లో ఒకటి. మన దేశంలో ఉన్న చాలా వర్గాలకు చెందిన మహిళలు కాళ్లకు పట్టీలను ధరిస్తారు. అయితే ఆ పట్టీలు వెండితో చేసినవే అయి ఉంటాయి. మహిళలు వివాహం చేసుకున్న సందర్భంలో కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతారు. అదే పట్టీలు అయితే ఆడపిల్ల పుట్టగానే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి పాదాలకు పట్టీలను తొడుగుతారు. పట్టీలు తొడుక్కుని ఆడపిల్లలు ఇంట్లో సందడిగా తిరుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని పండితులు చెబుతారు. అయితే పట్టీలను ఏ మహిళ అయినా సరే.. వెండి లోహంతో చేసినవే ధరించాలి. కానీ నేటి తరుణంలో చాలా మంది బంగారంతో చేసిన పట్టీలను తొడుగుతున్నారు. నిజానికి ఇలా చేయడం సరికాదు. ఇందుకు శాస్త్రీయంగానే కాదు, పురాణాల పరంగా కూడా కారణాలు ఉన్నాయి. అవేమిటంటే..
సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం.. బంగారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి అనే చెబుతారు. అలాగే లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమట. ఈ క్రమంలో బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది కనుక.. ఆ రంగులో వస్తువులు ఏవైనా సరే.. ఆఖరికి పట్టీలు అయినా సరే.. పాదాలకు ధరించకూడదు. ఇక ఈ విషయంలో సైన్స్ చెబుతున్నదేమిటంటే..
వెండి మన శరీరానికి చలువ చేస్తుంది. వెండి వస్తువులు ధరిస్తే శరీరంలో ఉన్న వేడి బయటకు పోతుంది. కనుక పాదాలకు ఎప్పుడూ వెండితో తయారు చేసిన ఆభరణాలనే ధరించాలి. అదే బంగారం అయితే ఒంట్లో వేడి పెరుగుతుంది. కనుక బంగారంతో చేసిన పట్టీలను వేసుకోరాదు. అయితే వెండితో చేసిన పట్టీలను ధరిస్తే నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు పోతాయట. అందుకోసమైనా మహిళలు వెండితో చేసిన పట్టీలను ధరించాల్సిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…