Ravi Chettu Pooja : ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటుంటారు. అంటే ప్రపంచంలో అన్నింటికీ ధనం కావాలి.. ధనంపైనే ఈ జగత్తు (ప్రపంచం) నడుస్తుందని అర్థం. అందుకనే మనిషి నిత్యం ధనం కోసం అన్వేషిస్తుంటాడు. డబ్బులు ఎలా సంపాదించాలి.. అని ఆలోచిస్తుంటాడు. అయితే ఈ విషయంలో కొందరు త్వరగా వృద్ధిలోకి వస్తారు. కానీ కొందరు మాత్రం అక్కడే ఉండిపోతారు. ఎలాంటి కష్టం పడినా సరే జీవితంలో పెద్దగా మార్పు ఉండదు. నిత్యం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటాడు. ఇలా చాలా మందే ఉన్నారు. అయితే కింద చెప్పిన విధంగా పలు సూచనలు పాటిస్తే.. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. ధనం సంపాదించేందుకు కావల్సిన అనుగ్రహం లక్ష్మీదేవి నుంచి లభిస్తుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఈశాన్యమూలన తులసి మొక్కను పెంచండి. పూజ గదిలో గంగాజలాన్ని ఉంచండి. దీనివల్ల ధనం పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఉన్న లక్ష్మీదేవీ (ఇరువైపులా దిగ్గజాలు అంటే ఏనుగులు ఉన్న) ఫొటో పెట్టుకోండి. వ్యాపార సంస్థల్లో అయితే నిలుచున్న ఫొటోను పెట్టుకోవాలి. లక్ష్మీ దేవీ స్వభావం చంచలం. అమ్మ స్థిరంగా ఉండాలంటే లక్ష్మీపతి వెంట ఉంటే తప్పక ఆమె అక్కడ స్థిరంగా ఉంటుంది. అంటే నారాయణుడు (విష్ణువు) ఎక్కడ ఉంటే లక్ష్మీ అక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి నారాయణుడిని ప్రసన్నం చేసుకునే పనులు ఎక్కువగా చేయాలి.
శ్రీనివాసుడిని లేదా శ్రీహరి లేదా వేంకటేశ్వరుడికి సంబంధించిన జపాన్ని కొంత సేపు నిష్ఠతో చేయండి. లేదా ధ్యానం చేయండి. కొంత కాలానికి మీకు మార్పు కనిపిస్తుంది. అవకాశం ఉన్నవారు రావిచెట్టుకు శనివారం, మంగళవారం పాలు, నీళ్లు, బెల్లం కలిపి పోసి ప్రార్థన చేయాలి. రావిచెట్టును అశ్వత్థ వృక్షం అంటారు. సాక్షాత్ విష్ణుస్వరూపం అయిన రావిచెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల పైన తెలిపిన విధంగా చేస్తే.. తప్పక లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు. దీంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ధనం బాగా సంపాదిస్తారు. సంపదకు లోటు లేకుండా ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…