Gold : అక్షయ తృతీయ రోజు కొంచమైనా పసిడి కొనుగోలు చేసే సంపద సిద్ధిస్తుందన్న నమ్మకంతో చాలా మంది ఆరోజు బంగారం కొనడం అనేది దేశంలో ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏవైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. దాంతో అప్పో సప్పో చేసి బంగారం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అలా చేయడం వలన బంగారం అక్షయం అవ్వడం అటుంచి అప్పుచేసి బంగారం కొనడం వలన మరిన్ని సమస్యల్లోకి వెళ్లడం జరుగుతుంది. ఇది మేం చెబుతున్నది కాదు స్వయంగా చాగంటి గారే చెప్పారు.
అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మను ఆచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అంటే పాపం కొనుక్కోవడం అని ప్రవచించారు చాగంటి వారు. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఎవరు చెప్పారో కానీ పురాణాల్లో, శాస్త్రాల్లో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.
ఆ రోజున బంగారం కొనుక్కోవడం పిచ్చి పని. బంగారం కొనడం వలన పాపం వృద్ధి చెందడం తప్ప ఎటువంటి లాభాలు ఉండవని చెప్పారు. మరి అక్షయ తృతీయనాడు ఏం చేయాలి అనేదానికి సమాధానం ఇచ్చారు. స్వయం పాకం, బట్టలు, గొడుగు, ద్రవ్యం అనగా డబ్బు, చెప్పుల జత లాంటివి దానం ఇవ్వాలి తప్ప.. బంగారం కొనడం వలన పాపం అక్షయం అవుతుందని చెప్పారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…