ఆధ్యాత్మికం

Samudra Manthan : క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో విషం, అమృత‌మే కాదు.. ఇవి కూడా ఉద్భ‌వించాయి..!

Samudra Manthan : హిందూ పురాణాల్లో ఇప్ప‌టికీ మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు దాగి ఉన్నాయి. వాటిలో క్షీర‌సాగ‌ర మ‌థ‌నం కూడా ఒక‌టి. అవును, అందులో నుంచే క‌దా విషం, అమృతం పుట్టాయి. విషాన్ని శివుడు త‌న కంఠంలో దాచుకోగా, అమృతాన్ని దేవ‌త‌లంద‌రూ తాగారు క‌దా.. అని మీరు అన‌బోతున్నారు క‌దా.. అయితే అది క‌రెక్టే, కానీ క్షీర‌సాగ‌ర మ‌థ‌నం జ‌రిగిన‌ప్పుడు ఇంకా కొన్ని ప్ర‌త్యేక‌మైనవి కూడా బ‌య‌టికి వ‌చ్చాయ‌ట‌. వాటి గురించే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది. అవేంటో తెలుసుకుందాం.

పురాణాల ప్ర‌కారం ఒక‌ప్పుడు దేవ‌త‌లు అమృతం కోసం శ్రీ‌మ‌హావిష్ణువు విశ్రాంతి తీసుకునే క్షీర‌సాగ‌రాన్ని మథించాల‌ని (చిల‌కాల‌ని) అనుకున్నార‌ట‌. అయితే అందుకు వారి బ‌లం స‌రిపోలేదు. దీంతో వారు రాక్ష‌సుల స‌హాయం కూడా తీసుకోవాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో దేవ‌త‌లు, రాక్ష‌సులు అంద‌రూ క‌లిసి ఆదిశేషువును తాడుగా, మంద‌రగిరి ప‌ర్వ‌తాన్ని క‌వ్వంలా చేసుకుని క్షీర‌సాగ‌రాన్ని మ‌థించ‌డం మొద‌లు పెడ‌తారు. ఆ క్రమంలో మంద‌ర‌గిరి ప‌ర్వ‌తం నేల‌కు కుంగిపోతూ ఉంటుంది. అప్పుడే విష్ణువు కూర్మావ‌తారం (తాబేలు) ఎత్తి త‌న చిప్ప‌ను ఆ ప‌ర్వ‌తం కింద పెడ‌తాడు. దీంతో మ‌ళ్లీ సాగ‌ర మ‌థ‌నం మొద‌లవుతుంది.

Samudra Manthan

అయితే ఈ క్షీర‌సాగ‌ర మ‌థ‌నాన్ని మన జీవితానికి కూడా అన్వ‌యించుకోవ‌చ్చ‌ని పురాణాల్లో చెప్పారు. అదెలాగంటే క్షీర సాగ‌రం మ‌న‌కు ప్ర‌పంచం లాంటిది. మంద‌ర‌గిరి ప‌ర్వ‌తం మ‌న హృద‌యం. మ‌న హృద‌యం దృఢంగా, నిశ్చ‌యంగా ఉండాలంటే అందుకు కూర్మం (తాబేలు అవ‌తారంలోని దేవుడు) అవ‌స‌రం. అదేవిధంగా ఆదిశేషువు మ‌న మైండ్‌. దీంతో ప్ర‌పంచం లాంటి స‌ముద్రాన్ని చిలికితేనే క‌దా మ‌నం అనుకున్న ఫ‌లితాలు వ‌స్తాయి. ఇక మంద‌ర‌గిరి ప‌ర్వతం అంటే మ‌న మ‌న‌స్సు అప్పుడ‌ప్పుడు గాడి త‌ప్పుతుంటుంది. అంటే ప‌ట్టు జారిపోతుంది. దాన్ని స‌రైన దారిలో న‌డిపించాలంటే మ‌న మ‌నస్సుపై మ‌న‌కు నియంత్ర‌ణ అవ‌స‌రం. దీన్నే పురాణాల్లో చెప్పారు.

క్షీర సాగ‌ర మ‌థనం జ‌రిపిన‌ప్పుడు బ‌య‌టికి వ‌చ్చిన‌వేంటో ఇప్పుడు చూద్దాం.. క్షీర సాగ‌ర మ‌థ‌నం జ‌రిపిన‌ప్పుడు చంద్రుడు బ‌య‌టికి వ‌స్తాడు. దాన్నిశివుడు త‌న త‌ల‌పై ధ‌రించాడు. విషం దావాన‌లంలా ఉద్భ‌విస్తుంది. దాన్ని శివుడు త‌న కంఠంలో దాచుకున్నాడు. 4 దంతాలు ఉన్న ఐరావ‌త‌మనే పెద్ద ఏనుగుతోపాటు మరో 64 ఇత‌ర తెల్ల ఏనుగులు బ‌య‌టికి వ‌చ్చాయి. వాటిని ఇంద్రుడు స్వీక‌రించాడు. ఉచ్ఛైశ్ర‌వ‌మ‌నే తెల్ల‌ని గుర్రం ఉద్భ‌వించింది. దాన్ని రాక్ష‌సుల రాజు బ‌లి స్వీక‌రించాడు. రంభ‌, ఊర్వ‌శి, మేన‌క‌, తిలోత్త‌మ వంటి అప్స‌ర‌స‌లు మ‌థ‌నం నుంచి ఉద్భ‌వించారు. వారిని స్వ‌ర్గానికి పంపారు. కోరిన కోర్కెలు తీర్చే ఆవు కామ‌ధేనువు జ‌న్మిస్తుంది. దాన్నుంచి వ‌చ్చే పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని య‌జ్ఞ యాగాదుల కోసం ఉప‌యోగించ‌డం మొద‌లు పెట్టారు.

ల‌క్ష్మీ దేవి ఉద్భ‌వించింది. ఆమె విష్ణువు మెడ‌లో దండ వేసి ఆయ‌న్ను వ‌రించి వెళ్లింది. అడిగిన‌వ‌న్నీ ఇచ్చే క‌ల్ప‌వృక్షం పుట్టుకొస్తుంది. దాన్ని స్వర్గంలో ఉంచారు. సురాపానానికి (మ‌ద్యం) అధిప‌తి అయిన వారుణీ దేవి పుట్టుకొస్తుంది. ఆమెను రాక్ష‌సులు స్వీక‌రిస్తారు. ముట్టుకోగానే ఎంత‌టి అల‌స‌ట‌నైనా దూరం చేసే పారిజాత వృక్షం ఉద్భ‌విస్తుంది. దాన్ని స్వర్గంలో ఉంచుతారు. మ‌ణుల్లోకెల్లా అత్యంత గొప్ప‌దైన కౌస్తుభ‌మ‌ణి పుట్టుకొస్తుంది. దాన్ని విష్ణువు త‌న వ‌క్ష‌స్థ‌లంపై అలంక‌రించుకున్నాడు. శంఖు చ‌క్రాలు పుట్టుకొస్తాయి. వాటిని కూడా విష్ణువే స్వీక‌రిస్తాడు. చివ‌రిగా ధ‌న్వంత‌రి అమృత భాండంతో క్షీర సాగ‌రం నుంచి బ‌య‌టికి వ‌స్తాడు. అందులో ఉన్న అమృతాన్ని తాగి దేవ‌తలు మృత్యుంజ‌యులుగా మారారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM