చిన్నారుల‌కు పుట్టు వెంట్రుక‌ల‌ను ఎందుకు తీస్తారు ? ఏ వ‌య‌స్సులో తీయాలి ?

June 19, 2023 7:18 PM

చిన్నారుల‌కు పుట్టు వెంట్రుక‌ల‌ను తీయ‌డం అనేది హిందూ సాంప్ర‌దాయంలో ఉంది. హిందువులంద‌రూ ఈ ఆచారాన్ని పాటిస్తూ వ‌స్తున్నారు. అయితే చిన్నారుల‌కు పుట్టు వెంట్రుక‌ల‌ను ఎందుకు తీస్తారు ? ఎప్పుడు తీస్తారు ? దాని వ‌ల్ల ఏమేం ప్ర‌యోజ‌నాలు ఉంటాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

pillalaku puttu ventrukalanu enduku theestharu

హిందూ ధ‌ర్మం ప్ర‌కారం చిన్నారుల‌కు పుట్టు వెంట్రుక‌ల‌ను తీయ‌డాన్ని చూడాకరణము అని అంటారు. హిందూ ధర్మంలో పదహారు రకాల సంస్కారాలు ఉంటాయి. వాటిలో చూడాకరణము కూడా ఒకటి. చూడ అంటే శిఖ (పిలక) అని అర్థం వ‌స్తుంది. ఆ శిఖను ఉంచుకొని మిగిలిన వెంట్రుకల‌ను తీసి వేయడాన్ని “చూడాకరణం” అని అంటారు. ఈ సంస్కారం వల్ల‌ పిల్లలకు బలం, ఆయుష్షు, వర్చస్సు కలుగుతాయని చెబుతారు.

పిల్ల‌ల‌కు మొదటి సంవత్సరంలో కానీ, మూడవ సంవత్సరంలో కానీ ఈ సంస్కారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పుట్టిన‌ప్ప‌టి నుంచి మూడేళ్ల వ‌ర‌కు ఏడాదికి ఒక‌సారి వెంట్రుక‌ల‌ను తీయాల‌ని కూడా కొంద‌రు పండితులు చెబుతారు. అయితే పుట్టు వెంట్రుక‌ల‌ను దాదాపుగా చాలా మంది పూర్తిగా తీసేస్తారు. కానీ ధ‌ర్మం ప్ర‌కారం పిల‌క‌లా ఉంచి మిగిలిన వెంట్రుక‌ల‌ను తీయాలి. ఇది తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది మొత్తం వెంట్రుక‌ల‌ను తీస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment