Money Found On Road : రోడ్డు మీద డబ్బులు దొరికాయా..? వాటిని తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

May 18, 2023 8:10 PM

Money Found On Road : మీరు దారిలో వెళ్తున్న ప్పుడు చాలా సార్లు రోడ్డుపై డబ్బులు కనిపిస్తూ ఉంటాయి. డబ్బు, నాణేలు లేదా నోట్ల‌ రూపంలో ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆ డబ్బును ఏమి చేయాలో తెలియ‌క‌ చాలా మంది మనసులో గందరగోళ ప‌డుతుంటారు. కొందరు వాటిని తీసుకుని తమ వద్ద ఉంచుకుంటారు. ఇంకొందరు పేదలకు ఇస్తారు లేదా ఆలయానికి విరాళంగా ఇస్తారు. అయితే రోడ్డుపై పడి ఉన్న డబ్బు తీసుకోవాలా వ‌ద్దా అనే ప్రశ్న సర్వ సాధారణంగా ఎవ‌రికైనా స‌రే వ‌స్తుంది. రోడ్డుపై పడి ఉన్న‌ డబ్బులు తీసుకోవడం మంచిదేనా.. ఇందుకు పండితులు ఏం చెబుతున్నారు.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసినప్పుడు శుభం కలుగుతుంద‌ట‌. రోడ్డుపై పడి ఉన్న నాణేన్ని చూస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా పని పూర్తి శ్రమతో చేస్తే మీరు క‌చ్చితంగా అందులో విజయం సాధిస్తారు. శాస్త్రం ప్రకారం మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళ్తుండగా మార్గమధ్యంలో పడి ఉన్న నాణెం లేదా నోటు కనిపిస్తే మీరు చేయబోయే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారని అర్థ‌మ‌ట‌.

Money Found On Road is it good or bad to take
Money Found On Road

మీరు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో డబ్బు కనిపిస్తే మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని సంకేతం. మీరు రోడ్డుపై ఉన్న డబ్బును చూస్తే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వండి లేదా మీరు దానిని మీ పర్సులో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ శాస్త్రం ప్రకారం దాన్ని ఖర్చు చేయకూడదు. దారిలో ఉన్న నాణేలను మీరు చూస్తే త్వరలో కొత్త పనిని ప్రారంభించవచ్చని అర్థం. ఈ పని మీకు విజయాన్ని, ఆర్థిక లాభాన్ని తెస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే దారిలో దొరికిన డ‌బ్బుల‌ను ఖ‌ర్చు చేయ‌కుండా ద‌గ్గ‌రే పెట్టుకోవాలి. లేదా దానం, విరాళం ఇవ్వాలి. ఇలా చేస్తేనే పైన చెప్పిన ఫ‌లితాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment