Marriage With Same Gothram : అబ్బాయి, అమ్మాయి ఒకే గోత్రం అయితే పెళ్లి చేసుకోకూడదా..? ఏం అవుతుంది..?

December 20, 2023 7:40 PM

Marriage With Same Gothram : హిందూమతంలో, వివాహానికి ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు లేదు. ఎప్పుడైనా సరే, ఎవరికైనా పెళ్లి చేయాలంటే, కుటుంబం గురించి చూసుకుంటారు. అలానే, ఇంటి పేర్లు, ఉద్యోగం, డేట్ అఫ్ బర్త్ తో పాటుగా గోత్రాలని కూడా చూసుకుంటారు. ఒకే గోత్రం వాళ్ళని ఇచ్చి, అసలు పెళ్లి చేయరు. అయితే, వివాహం అంటే మనం హిందూ సంప్రదాయం ప్రకారం పాటిస్తాము. ఒక్కొక్క ప్రాంతంలో, సంప్రదాయాన్ని పాటించడం జరుగుతుంది. కానీ, చాలా చోట్ల ఒకే గోత్రం వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయరు. అంటే, వరుడికి, వధువుకి ఒకే గోత్రం ఉండకూడదు.

వేరు వేరు గోత్రాలు అయ్యి ఉండాలి. పెళ్లి చేసుకునే అబ్బాయి, అమ్మాయి ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు. అయితే, ఆ పెళ్లిని చేయరు. అందుకనే, ముందు గోత్రం ఏంటో కనుక్కొని, ఆ తర్వాత పెళ్లి చేస్తారు. అబ్బాయి, అమ్మాయి గోత్రాలు వేరువేరుగా ఉండి, జాతకం కలిస్తే పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారు. ఒకే గోత్రం వాళ్ళని ఇచ్చి ఎందుకు పెళ్లి చేయరు..? దానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. గోత్రాలు సప్త ఋషుల వంశస్థుల రూపంలో ఉంటాయి.

Marriage With Same Gothram what happens if anybody does it
Marriage With Same Gothram

గౌతమ, కశ్య, వశిష్ట, భరద్వాజ, అత్రి, అంగీరస, మృగు. ఈ ఏడు మంది మహర్షులని సప్త ఋషులుగా పరిగణిస్తారు. వేద కాలం నుండి, గోత్రాలకు ప్రాధాన్యత ఉంది. రక్తసంబందికుల మధ్య, పెళ్లి జరగకుండా ఉండడానికి, ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. దీంతో, పాటు ఒకే గోత్రంలోని అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి చేసుకోకూడదని కఠిన నిబంధన ఉంది.

ఒకే గోత్రానికి చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు సోదరులు సోదరీమణులు సంబంధాన్ని కలిగి ఉంటారు. అందుకని చెయ్యరు. అలానే స్త్రీ, పురుషుడు ఒకే గోత్రం వాళ్ళు వివాహం చేసుకుంటే సంతానం పొందడంలో ఆటంకాలు ఏర్పడతాయి. పిల్లలలో జన్యుపరమైన లోపాలు ఏర్పడతాయి. మానసిక సమస్యలు వస్తాయి. ఇలా, ఈ కారణంగానే ఒకే గోత్రం వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయరు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now