Lord Surya Idols : హిందూ పురాణాల్లో సూర్య దేవునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది సూర్యున్ని రోజూ పూజిస్తారు, ప్రార్థిస్తారు కూడా. కొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. నిజానికి సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. ఆయన్ను పూజిస్తే జ్ఞానం, సంపద లభిస్తాయని నమ్ముతారు. ఆ కోవలోనే చాలా మంది సూర్యున్ని నిత్యం పూజిస్తారు. అయితే పలు రకాల లోహాలతో చేసిన సూర్యుని బొమ్మలను పూజించినా కూడా ముందు చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయట. మరి సూర్యునికి చెందిన ఏ తరహా బొమ్మలను పూజించాలో ఇప్పుడు తెలుసుకుందామా.
స్థోమత ఉన్న వారు బంగారంతో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. దీంతో అమితమైన సంపద కలుగుతుంది. ఇంట్లో ఉన్న వారికి జ్ఞానం సిద్ధిస్తుంది. కొత్తగా పెళ్లయిన దంపతులు రాగితో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించాలి. దీంతో వారి వైవాహిక జీవితం బాగుంటుంది. పిల్లలు త్వరగా కలుగుతారు. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. వెండితో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే సమాజంలో అందరి మధ్య గౌరవం పెరుగుతుంది. పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. కెరీర్ బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
రాయి లేదా మట్టితో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే లక్ కలసి వస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎలాంటి సమస్యలు ఎదురు కావు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. చెక్కతో చేసిన సూర్యుని బొమ్మను ఇంట్లో పెట్టుకుని ప్రార్థిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. అదృష్టవంతులుగా మారుతారు. అనుకున్నవి నెరవేరుతాయి. జీవితాంతం కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. గ్లాస్ లేదా ఇనుము తో చేసిన సూర్యుని బొమ్మలు, విగ్రహాలను మాత్రం ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. వీటి వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఏది చేసినా కలసి రాదు. అనుకున్న పనులు పూర్తి కావు. అన్నీ సమస్యలే ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…