Kidney Stones And Tomatoes : మనకు మార్కెట్‌లో చాలా సులభంగా లభ్యమయ్యే అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిని నిత్యం అనేక మంది కూరల్లో వాడుతుంటారు. కొందరు పలు ఆహార పదార్థాలను వండేందుకు ఉపయోగిస్తారు. ఇంకా కొందరు సలాడ్స్, సూప్, జ్యూస్ వంటివి చేసుకుని టమాటాలను తీసుకుంటుంటారు. అయితే టమాటాలను ఏ రకంగా తీసుకున్నా మనకు లాభమే ఉంటుంది కానీ, నష్టం మాత్రం ఉండదు. కానీ కొందరు మాత్రం టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయని అంటుంటారు. అయితే ఇందులో నిజమెంత..? నిజంగానే టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయా..? ఈ విషయంపై పరిశోధకులు ఏమంటున్నారు..? అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
టమాటాలను తినడం వల్ల కిడ్నీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కానీ.. అది చాలా తక్కువ శాతం మాత్రమే. అసలు కిడ్నీ స్టోన్లు రాని వారు నిర్భయంగా టమాటాలను రోజూ తినవచ్చు. ఇక కిడ్నీ స్టోన్లు వచ్చిన వారు, ఇతర కిడ్నీ సమస్యలు ఉన్నవారు.. మళ్లీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కనుక టమాటాల వినియోగం తగ్గించాలి. దీంతో మళ్లీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. అంతేకానీ.. అసలు కిడ్నీ సమస్యలు లేనివారు, స్టోన్లు అసలు రాని వారు టమాటాలను తీసుకోవచ్చు. వాటిని తీసుకోవడం మానేయాల్సిన పనిలేదని పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణంగా కిడ్నీ స్టోన్లు మినరల్స్, ఆగ్జలేట్స్, కాల్షియం, యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోవడం వల్ల ఏర్పడుతాయి. అయితే కిడ్నీ స్టోన్లు ఓవర్‌నైట్‌లో తయారు కావు. అవి ఏర్పడేందుకు చాలా కాలం పడుతుంది. అయితే కిడ్నీ స్టోన్లు వచ్చిన వారు మళ్లీ అవి రాకుండా ఉండేందుకు గాను కచ్చితమైన డైట్‌ను పాటించాలి. అందులో భాగంగానే వారు టమాటాలు, పాలకూర వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. దీంతో మళ్లీ కిడ్నీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. ఇక అసలు స్టోన్స్ సమస్య లేనివారు ఏ పదార్థాలనైనా నిర్భయంగా తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…