Dal Tadka : సాధారణంగా పప్పుతో చేసుకునే ఏ వంటకమైనా చాలా రుచిగానే ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు అనేక రకాల పప్పు వంటకాలు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దాల్ తడ్కా ఒకటి. దీన్ని ధాబాల్లో అద్భుతంగా చేస్తారు. అయితే కొద్దిగా శ్రమించాలే గానీ మనం ఇంట్లోనూ ధాబా స్టైల్‌లో దాల్ తడ్కాను చేసుకుని ఆరగించవచ్చు. మరి దాల్ తడ్కాను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
దాల్ తడ్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు- 1/2 కప్పు, పెసరపప్పు- 1/2 కప్పు, శనగపప్పు- 1/4 కప్పు, మైసూర్ పప్పు- 1/4 కప్పు, చిన్న ఉల్లిపాయ – 1, చిన్న టమాటా – 1, పచ్చిమిరపకాయలు – 2, అల్లం – చిన్నముక్క, ధనియాలపొడి – 1/4 టీ స్పూన్, గరం మసాలా- 1/4 టీ స్పూన్, ఉప్పు- 1/2 టీ స్పూన్, పసుపు- 1/4 టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ- 1/2 టీ స్పూన్, కసూరి మేథీ- 1/4 టీ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర – 1/4 కప్పు, చింతపండు రసం – 2 టీ స్పూన్లు.
దాల్ తడ్కా తయారీ విధానం..
పైన చెప్పిన పప్పులన్నింటినీ కలిపి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. బాణలి తీసుకుని అందులో నెయ్యి వేసి వేడెక్కాక.. జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. అనంతరం అందులో కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలు, టమాటాలను వేసి బాగా వేయించుకోవాలి. అనంతరం అందులో ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలపాలి. తరువాత మెత్తగా ఉడికిన పప్పు మిశ్రమాన్ని మరింత మెత్తగా చేసి పోపులో వేయాలి.
ఆ తరువాత ధనియాల పొడి, గరం మసాలా, కసూరీ మేథీ వేసుకోవాలి. అవసరం అనుకుంటే అందులో చింత పండు రసం కూడా కలుపుకోవచ్చు. ఆ తరువాత పప్పును బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంతరం దానిపై కొత్తిమీర వేసి దింపాలి. అంతే.. ఘుమ ఘుమలాడే దాల్ తడ్కా తయారవుతుంది. దీన్ని చపాతీలు లేదా అన్నంతో లాగించేయవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…