విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. మార్చి 13, 2026 నుంచి ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సినిమా గత ఫిబ్రవరి నెలలో 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. చిత్రం థియేటర్లలో రిలీజ్ అయిన సరిగ్గా నెల రోజులకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫంకీ చిత్రానికి కేవీ అనుదీప్ దర్శకత్వం వహించగా ఇందులో నరేష్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో పలువురు నిర్మాతలు, దర్శకులు సైతం అతిథి పాత్రల్లో యాక్ట్ చేసి మెప్పించారు. ఇక ఈ చిత్ర కథ వివరాలు ఇలా ఉన్నాయి.
కోమల్ (విశ్వక్ సేన్) సినిమా రంగానికి కొత్త. ఏదైనా ఒక సినిమాకు దర్శకత్వం వహించి విజయం సాధించాలని చూస్తుంటాడు. మంచి ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థలో కోమల్ కు అవకాశం వస్తుంది. దీంతో రూ.4 కోట్లలోనే సినిమా పూర్తి చేస్తానని దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఫంకీ అనే సినిమాను ప్రారంభిస్తాడు. అయితే రాను రాను ఆ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లకు చేరుతుంది. చాలా కాలం అవుతుంది. అయినా సినిమా పూర్తి కాదు, దీంతో మంచి ప్రొడక్షన్స్ నిర్మాత (నరేష్) ఒత్తిడికి గురై హాస్పిటల్‌లో చేరతాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న నిర్మాత కుమార్తె చిత్ర (కయాదు లోహర్) ఆ సినిమా బాధ్యతను నెత్తిన వేసుకుంటుంది. బడ్జెట్ పెరగకుండా దర్శకుడితో మూవీ పూర్తి చేస్తానని ఆమె ఎంట్రీ ఇస్తుంది. అయితే చిత్ర ఆ బడ్జెట్‌లోనే కోమల్‌తో సినిమాను పూర్తి చేసిందా.. అసలు చివరకు ఏం జరిగింది.. అన్న వివరాలను తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.
ఇందులో ఈశ్వరీరావు, సంపత్ రాజ్, దిల్ రాజు, హరీష్ శంకర్, అనుదీప్ కేవీ, కల్యాణ్ శంకర్ నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టెయిన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కించారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాధ్యతలను చేపట్టగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సంగీతం అందించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…