Left Arm Pain : సాధారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే ఎవరికైనా సరే ఎడమ చేయి బాగా నొప్పిగా ఉంటుంది. భుజం నుంచి చేయి కింద వరకు లాగినట్టు నొప్పి వస్తుంది. అలాగే ఛాతి మధ్యలో నొప్పి మొదలై పైకి వ్యాపిస్తుంది. ఇక కొందరికి ఎడమ వైపు దవడ నొప్పిగా ఉంటుంది. ఇవన్నీ హార్ట్ ఎటాక్ వస్తుందని తెలిపే లక్షణాలు. అయితే ఇవి లేకుండా కేవలం ఎడమ చేయి నొప్పి మాత్రమే ఉంటే దాన్ని చాలా మంది గుండె సమస్య అని భావిస్తుంటారు. కానీ కింద తెలిపిన పలు కారణాల వల్ల కూడా కొందరికి ఎల్లప్పుడూ ఎడమ చేయి నొప్పిగా ఉంటుంది. మరి ఆ కారణాలు ఏమిటంటే..
నిద్రించే భంగిమ, కంప్యూటర్ ఎదుట కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోయినా ఎడమ చేయి నొప్పిగా అనిపిస్తుంది. ఆ భంగిమను సరి చేసుకోవడం ద్వారా ఆ నొప్పిని తగ్గించుకోవచ్చు. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయినా కొన్ని సార్లు ఎడమ చేయి నొప్పి వస్తుంటుంది. దీన్ని తగ్గించుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయాలి. సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం మానేయాలి. అలాగే కెఫీన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలు అతిగా తాగరాదు. నిత్యం తగినంత నీటిని తాగాలి. సమయానికి నిద్ర పోవాలి. దీంతో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.
కొన్ని సార్లు గ్యాస్, అసిడిటీ సమస్య వల్ల కూడా ఎడమ చేయి నొప్పి వస్తుంటుంది. దీన్ని నివారించేందుకు వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. గ్యాస్, అసిడిటీ తగ్గితే కొందరికి ఎడమ చేయి నొప్పి కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఆ సమస్యకు చికిత్స తీసుకుంటే ఆటోమేటిగ్గా నొప్పి కూడా తగ్గుతుంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా వాడే కీమో థెరపీ మందులు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్ డ్రగ్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల కూడా కొన్ని సార్లు ఎడమ చేయి నొప్పిగా అనిపిస్తుంది. అందుకు గాను వైద్యుడిని కలిసి సరైన మెడిసిన్ ఇచ్చేలా చూసుకోవాలి. దీంతో నొప్పిని తగ్గించుకోవచ్చు.
పైన తెలిపిన సూచనల మేరకు తగిన విధంగా స్పందిస్తే ఎడమ చేయి నొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ, పైన తెలిపిన సమస్యలు ఏవీ లేనప్పటికీ ఎడమ చేయి ఇంకా నొప్పిగా ఉంటే.. అప్పుడు దాన్ని కచ్చితంగా గుండె సమస్యగా అనుమానించాలి. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి ఆ మేరకు వైద్య పరీక్షలు చేయించుకుని అందుకు తగిన విధంగా చికిత్స తీసుకుంటే హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…