Lord Shani : శనిప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే.. విష్ణుసహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెబుతున్నారు. ప్రతి శనివారం శనిదేవునిని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేయాలి. పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభఫలితాలను ఇస్తాడు.
యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి. ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు ఉంటుంది కాబట్టి, శని పాపగ్రహం కావున కష్టాలను ఇస్తాడు. కనుక ఈ గ్రహం రాశిలో ఉన్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, అథమ స్థానానికి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంటాయి.
అయితే శని మన రాశిలో ప్రవేశిస్తే కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు. వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి ఇస్తాడు. కానీ వాటి వెనుక అధిక ఖర్చు వంటి ఇబ్బందులు సృష్టిస్తాడు. అందుకే ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కాలంటే శనివారం శనీశ్వర పూజ చేసి ఆయన్ని శాంతింపజేయాలి. నువ్వులనూనె, శంఖుపువ్వులను సమర్పించి ప్రార్థించాలి. ఇలా చేస్తే శని గ్రహ ప్రభావం తగ్గుతుంది. ఈతి బాధలు సైతం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…