Hair Growth : నేటి తరుణంలో అందంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా తమ అందాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే అందం విషయానికి వస్తే ముఖంతోపాటు ప్రధానంగా చెప్పుకోదగినవి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా వాటిని చూసి ఆకర్షింపబడతారు. ఈ క్రమంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ రసం బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసంతో వెంట్రుకలకు పోషణను ఎలా అందించవచ్చో ఇప్పుడు చూద్దాం.
కొన్ని ఉల్లిపాయలను తీసుకుని వాటిని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను తల కుదుళ్లకు తగిలేలా రాయాలి. తరచూ ఇలా చేస్తుంటే తలపై ఊడిపోయిన వెంట్రుకలు మళ్లీ పెరుగుతాయి. అంతేకాదు వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా ఉంటాయి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ అనే మూలకం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అలాగే ఉల్లిపాయలను బాగా దంచి ఆ మిశ్రమంలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఇతర ఏవైనా ఆయిల్స్‌ను కలిపి రాసుకోవాలి. దీంతో శిరోజాలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢమై వెంట్రుకలు ఆరోగ్యాన్ని, కాంతిని సంతరించుకుంటాయి.
ఉల్లిపాయలను మెత్తగా దంచి వాటి నుంచి తీసిన రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. అనంతరం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. రెగ్యులర్‌గా ఈ టిప్‌ను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు. శిరోజాలు కూడా కాంతివంతమవుతాయి. ఈ చిట్కాలను కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా పాటింవచ్చు. దీంతో చక్కని శిరోజాలు వారి సొంతమవుతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…