Lakshmi Kataksham : కొందరికి ధైర్య లక్ష్మి, విజయలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి ఇంకా ఇతర లక్ష్ముల ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఐశ్వర్య లక్ష్మి అంటే డబ్బు వచ్చే లక్ష్మి మాత్రం ఉండదు. దాంతో ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. పెద్ద ఉద్యోగం చేసినా లేదా వ్యాపారం చేసినా కూడా డబ్బులు వస్తూ ఉంటాయి కానీ వచ్చిన వెంటనే పోతాయి. వేలు, లక్షలు, కోట్లు ఇలా డబ్బు వచ్చి పోవడం అంటే లక్ష్మీ కటాక్షం లేదు అనుకోవచ్చు. ఇంట్లో డబ్బు లేదు అంటే ఖచ్చితంగా లక్ష్మీ దేవి కటాక్షం మీ పై లేదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఐశ్వర్య లక్ష్మి కటాక్షం లేకుంటే ఎంత విజయాలు దక్కించుకున్నా ఫలితం లేదు. మరెన్నో అద్బుతాలు చేసినా కూడా ప్రయోజనం అనేది లేదు.
కర్పూరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగదిలో ఉంటుంది. కర్పూరం వారంలో కనీసం ఒక్కసారి వెళిగించినా కూడా ఇళ్లంతా కూడా పవిత్రం అవ్వడంతో పాటు కర్పూరం పొగకు మొత్తం క్రిములు వెళ్లి పోతాయి అనేది నిరూపితం అయిన విషయం. అలాంటి కర్పూరంను ఒక బిళ్ల లేదా ఒక ప్యాకెట్ తీసుకుని పాకెట్ లో లేదా వాలెట్ లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎక్కడకు వెళ్లినా కూడా కర్పూరంను తీసుకెళ్లడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. కర్పూరంను కొందరు ఆరోగ్యంకు సహకరించేది అనుకుంటారు. కానీ ఐశ్వర్య లక్ష్మిని తెచ్చి పెట్టేది అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
హిందువు అనే వారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో కొబ్బరికాయ కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఐశ్వర్య లక్ష్మి దేవికి శ్రీఫలం అంటే చాలా ఇష్టం. అలాంటి శ్రీఫలం మన ఇంట్లో ఉంటే లక్ష్మి దేవి ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది. శ్రీఫలం అంటే అతి చిన్న కొబ్బరిని శ్రీఫలం అంటూ ఉంటారు. శ్రీఫలం నుండి ఇప్పటికే చాలా మంది చాలా రకాల ప్రయోజనాలు పొందే ఉంటారు.
మార్కెట్ కు వెళ్లిన సమయంలో మీకు కనిపించిన కొబ్బరి కాయల్లో అతి చిన్న కొబ్బరి కాయ తీసుకు వచ్చి పూజ గదిలో పెట్టండి. పూజ సమయంలో ఆ కొబ్బరి కాయ కొట్టినా మళ్లీ తీసుకు వచ్చి పెట్టండి. అలా చేయడం వల్ల ఐశ్యర్యం మీ చెంతకు వచ్చి ఉండి పోతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…